రోహిత్ సేన (PC: BCCI)
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఈ మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్ జూన్ 9న నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు.
పాకిస్తాన్‌పై గెలవడం టీమిండియాకు తేలికేనన్న కైఫ్.. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లున్న దాయాదితో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘‘పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనంగా ఉందని మనకు తెలుసు.
కానీ ఫఖర్ జమాన్ క్రీజులో కుదురుకున్నాడంటే ఫాస్ట్‌గా ఆడతాడు. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేయగలడు. ఇఫ్తికార్ అహ్మద్ కూడా బాగానే ఆడతాడు. మిగతావాళ్ల స్ట్రైక్‌రేటు 120- 125 మధ్య ఉంటుంది.
కాబట్టి వాళ్ల బ్యాటింగ్ గురించి మనం అస్సలు భయపడాల్సిన పనేలేదు. అయితే, వాళ్ల బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా నసీం షా.
అతడు ఇండియాలో వరల్డ్‌కప్ ఆడలేదు. గాయం కారణంగా అప్పుడు జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మ్యాచ్ జరిగే న్యూయార్క్ పిచ్ బౌన్సీగా కనిపిస్తోంది.
నిజానికి నసీం షా మంచి బౌలర్. గత మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌లో నసీం షా ఫస్ట్ స్పెల్ అద్భుతంగా వేసిన తీరు చూశాం కదా!’’ అంటూ మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment