సిడ్నీ: బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) 2022 నుంచి పాక్ క్రికెటర్లు మహ్మద్ హస్నైన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్‌లు అర్ధంతరంగా వైదొలిగారు. స్వదేశంలో త్వరలో(జనవరి 27 నుంచి) ప్రారంభంకానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) కోసం బీబీఎల్‌ను వీడి రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా తిరుగు టపా కట్టారు.
బీబీఎల్‌లో మెల్‌బోర్స్ స్టార్స్ తరఫున హరీస్ రౌఫ్, బ్రిస్బేన్ హీట్ తరఫున ఫకర్ జమాన్, సిడ్నీ సిక్సర్స్ తరఫున షాదాబ్ ఖాన్, సిడ్నీ థండర్స్ తరఫున హస్నైన్ ఆడుతున్నారు. వీరంతా లీగ్ కీలక దశలో ఉండగా తిరిగి వెళ్లడంతో ఆయా జట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, జాతీయ జట్టుతో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం బీబీఎల్‌ను వీడాడు. రషీద్ బీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రైయికర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
చదవండి: ఐపీఎల్ 2022లో వారి మెరుపులు లేనట్టేనా..?
Comments
Please login to add a commentAdd a comment