
బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం(PC: Pakistan Cricket Twitter)
ట్రై సిరీస్‌ను గెలుపుతో మొదలుపెట్టిన పాకిస్తాన్
New Zealand T20I Tri-Series 2022 - Bangladesh vs Pakistan 1st T20: న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో బాబర్ ఆజం బృందం శుభారంభం చేసింది. త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి టీ20లో పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అజేయ అర్ధ శతకం(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 78 పరుగులు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
న్యూజిలాండ్ వేదికగా..
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో న్యూజిలాండ్ స్వదేశంలో ట్రై సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం పాకిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు తొలి టీ20లో తలపడ్డాయి. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
చెలరేగిన రిజ్వాన్..
బంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు రిజ్వాన్ శుభారంభం అందించాడు. 78 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ బాబర్ ఆజం 22 పరుగులు సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్ 22 బంతుల్లో 31 పరుగులతో రాణించాడు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బాబర్ ఆజం బృందం 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మెహెదీ హసన్ మిరాజ్ 10, సబ్బీర్ రెహమాన్ 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
అలీ మెరుపు ఇన్నింగ్స్ వృథా
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన లిటన్ దాస్ 35 పరుగులు, నాలుగో స్థానంలో వచ్చిన అఫిఫ్ హొసేన్ 25 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యాసిర్ అలీ (21 బంతుల్లో 42 పరుగులు, నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో 146 పరుగులకే నూరుల్ హసన్ బృందం కథ ముగిసిపోయింది.
పాక్ చేతిలో 21 పరుగులతో బంగ్లా ఓటమిని మూటగట్టుకుంది. ఇక మొదటి మ్యాచ్‌లో విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోటీపడనుంది.
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు
పాకిస్తాన్- 167/5 (20)
బంగ్లాదేశ్ 146/8 (20)
చదవండి: T20 World Cup 2022: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం!
IND Vs SA: 'దటీజ్ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి'