ఢాకా: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ 20లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర వేసిన ఒక బంతి బ్యాట్స్‌మన్‌ను షాక్‌కు గురిచేసింది. పిచ్‌పై పడగానే బంతి అనూహ్య టర్న్ తీసుకొని నేరుగా ఆఫ్‌స్టంప్ అవతల మీదుగా వికెట్‌కీపర్ చేతిలో పడింది. బ్యాట్‌తో టచ్ చేసి ఉంటే మాత్రం వికెట్ కచ్చితంగా పోయి ఉండేది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో చోటుచేసుకుంది. రవీంద్ర వేసిన బంతి పిచ్‌పై పడగానే మహ్మదుల్లా లెగ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లడంతో మహ్మదుల్లా బంతిని టచ్ చేయలేదు. ఆ తర్వాత బతికిపోయాను అన్న తరహాలో మహ్మదుల్లా ఇచ్చిన లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కివీస్ ఆటగాడు గ్రాంట్ ఇలియట్ తన ట్విటర్‌లో పంచుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయాన్ని అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ విజయంతో బంగ్లాదేశ్ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం 142 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది.
Never easy in Bangladesh! Watching the @BLACKCAPS batters struggling in foreign conditions. How’s this for a delivery though? #turnandbounce pic.twitter.com/DbXFykjzlV
— Grant Elliott (@grantelliottnz) September 1, 2021
Comments
Please login to add a commentAdd a comment