Ind Vs SL 1st T20: Wasim Jaffer Picks Playing XI, Ruturaj And Umran Missed - Sakshi
Sakshi News home page

Ind Vs SL: రుతురాజ్‌, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌.. గిల్‌ అరంగేట్రం!

Published Tue, Jan 3 2023 1:30 PM | Last Updated on Tue, Jan 3 2023 1:54 PM

Ind Vs SL 1st T20: Wasim Jaffer Playing XI Ruturaj Umran Missed - Sakshi

హార్దిక్‌ పాండ్యాతో సూర్యకుమార్‌ యాదవ్‌ (PC: BCCI)

India vs Sri Lanka, 1st T20I: శ్రీలంకతో తొలి టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ భారత తుది జట్టును అంచనా వేశాడు. వాంఖడే వేదికగా మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ టీ20 అరంగేట్రం ఖాయమని అభిప్రాయపడ్డాడు. యువ సంచలనం ఇషాన్‌ కిషన్‌కు జోడీగా గిల్‌ ఓపెనింగ్‌ చేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.

ఇక స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు తన జట్టులో చోటివ్వని వసీం జాఫర్‌.. మరో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌, ఫాస్ట్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌లను ఎంపిక చేసుకున్నాడు. స్పిన్‌ విభాగంలో ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ హుడా సహా సీనియర్‌ లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ సేవలు అవసరమని అభిప్రాయపడ్డాడు.

అదే విధంగా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వన్‌డౌన్‌లో టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్‌ యాదవ్‌, నాలుగో స్థానంలో సంజూ శాంసన్‌, ఐదో స్థానంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా వస్తే బాగుంటుందని వసీం జాఫర్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఈ మాజీ ఓపెనర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

శ్రీలంకతో టీమిండియా తొలి టీ20
వసీం జాఫర్‌ భారత జట్టు:
శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షల్‌ పటేల్‌, యజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

చదవండి: Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్‌ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా
Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్‌ చాలు! మాట ఇస్తున్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement