Wasim Jaffer Hillarious Troll ICC Schedule For Upcoming Tournaments - Sakshi
Sakshi News home page

Wasim Jaffer: అస్సలు గ్యాప్‌ లేదుగా.. ఒకటి పోతే మరొకటి

Published Wed, Nov 17 2021 5:10 PM | Last Updated on Wed, Nov 17 2021 5:42 PM

Wasim Jaffer Hillarious Troll ICC Schedule For Upcoming Tournaments - Sakshi

Wasim Jaffer Dig ICC About Schedule For Upcoming Tournaments 2024-2031.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడేళ్ల కాలంలో ఐసీసీ ఎనిమిది మేజర్‌ టోర్నీలను నిర్వహించడానికి ప్లాన్‌ చేసింది. అందుకు సంబంధించి టోర్నీ నిర్వహించనున్న దేశాల జాబితాను మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఏడాదికి ఒకటి చొప్పున ఐసీసీ మేజర్‌ టోర్నీలు జరగనుండడంతో క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఐసీసీని ట్రోల్‌ చేస్తూ సూపర్‌ మీమ్‌తో మెరిశాడు.

చదవండి: ICC 2024-2031 Events Schedule: ఒకటి అమెరికా.. మరొకటి పాకిస్తాన్‌.. మూడు ఇండియాలో

''టీమిండియా కప్‌ కొట్టలేదని భాదపడకండి.. రానున్న ఏడేళ్లు మనవే.. అసలు గ్యాప్‌ లేకుండా ఐసీసీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసింది. ఒకదాంట్లో కప్‌ కొట్టకపోయినా పర్లేదు.. మరొకటి వెంటనే వచ్చేస్తుంది. చీర్‌ అప్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. 

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) 2024 నుంచి 2031 మధ్య జరగనున్న ఐసీసీ మేజర్‌ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనున్న దేశాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇక 2024-2031 మధ్య కాలంలో నాలుగు టి20 వరల్డ్‌కప్‌లు..  రెండు చాంపియన్స్‌ ట్రోపీలు, రెండు వన్డే వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. 

చదవండి: ICC T20 Rankings: బాబర్‌ అజమ్‌ నెంబర్‌వన్‌.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement