గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఆసియాకప్‌తో మైదానంలో అడుగుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అతడి ఫిట్‌నెస్‌కు సంబంధించి మెడికిల్ బులెటిన్ బీసీసీఐ విడుదల చేసింది. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడాని, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని బీసీసీఐ తెలిపింది.
ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లు జరగనుండడంతో బుమ్రా తిరిగి రావడం టీమిండియాకు ఎంతో అవసరం. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడని జాఫర్ జోస్యం చెప్పాడు. "జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్‌లో చాలా కీలకం.
అతడు ప్రపంచకప్‌లో ముఖ్య పాత్ర పోషిస్తాడని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం డెత్ బౌలింగ్‌లో అతడు లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. అతడి సేవలను ఈ ఏడాది మొత్తం భారత్ కోల్పోయింది. బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అయితే అతడు తిరిగి వచ్చిన అదే వేగంతో బౌలింగ్ చేయగలడా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. కానీ బుమ్రా అదే స్పీడ్‌ను కొనసాగిస్తే అతడిని మించినవారే ఉండరు" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! టీమిండియా కెప్టెన్‌పై సీరియస్
Comments
Please login to add a commentAdd a comment