ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుస ఓటుములతో సతమతమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తున్నప్పటికి.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన వంతు న్యాయం చేస్తున్నాడు.
కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వరల్డ్‌కప్-2024కు ముందు బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉండటం భారత జట్టు కలిసిచ్చే ఆంశం.
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు దాదాపు లేకపోవడంతో మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో మరో మ్యాచ్ తర్వాత ముంబై భావితవ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్రమిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం బెటర్. అది టీమిండియాకు బాగా కలిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్‌ఫోలో జాఫర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment