ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు.
తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం(మే 7 నాటికి) అగ్రస్థానంలో నిలిచి.. పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.
ఆశలు సజీవమే
వాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ముంబై.. ఈ సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ అధికారికంగా ముంబై ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదు.
ఇక ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్ చేరితే సంగతి వేరు!
కాగా మే 26 నాటి ఫైనల్‌తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలి
ఈ నేపథ్యంలో పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం విశ్రాంతినివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అసిస్టెంట్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు సోమవారం ప్రశ్న ఎదురైంది.
కుదరదు
ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంపై నేను స్పష్టతనివ్వలేను. అయితే, మేమంతా ఇక్కడున్నది సీజన్ ఆసాంతం సేవలు అందించడానికే! ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేము.
వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడటం అనవసరం. ఇలాంటివి ప్రస్తుత ప్రదర్శనలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.
చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment