T20 World Cup 2021: Wasim Jaffer Share Kane Williamson-Kohli Funny Photo- Sakshi
Sakshi News home page

T20 WC 2021: కోహ్లి.. టాస్‌ కోసం ఏమైనా టిప్స్‌ ఇస్తావా: కేన్‌ విలియమ్సన్‌

Published Sat, Nov 13 2021 1:54 PM | Last Updated on Sat, Nov 13 2021 3:35 PM

T20 World Cup 2021: Wasim Jaffer Share Kane Williamson-Kohli Funny Photo - Sakshi

Wasim Jaffer tweets a funny meme on Kohli and Kane Williamson.. టి20 ప్రపంచకప్‌ 2021 ఫైనల్‌ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఫన్నీ ట్రోల్‌ చేశాడు. '' ఆసీస్‌తో ఫైనల్‌ కోసం కోహ్లికి కేన్‌మామకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తాడు. దీనికి విలియమ్సన్‌ థ్యాంక్స్‌.. టాస్‌ కోసం ఏమైనా టిప్స్‌ ఇస్తావా'' అన్నట్లుగా ఫోట్‌ షేర్‌ చేయడం వైరల్‌గా మారింది. ఈ ప్రపంచకప్‌లో టాస్‌ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్‌ గెలిచిన జట్లే ఎక్కువగా విజయాలు నమోదు చేశాయి. అయితే కోహ్లికి మాత్రం టాస్‌ కలిసి రాలేదు. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ల్లో కోహ్లి టాస్‌ ఓడిపోవడం పెద్ద దెబ్బ. రెండు వరుస ఓటములు మనను సెమీఫైనల్‌కు దూరం చేశాయి. ఆ తర్వాత భారీ విజయాలు సాధించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఫైనల్‌ మ్యాచ్‌లోనూ టాస్‌ కీలకంగా మారనుంది.

చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ...

 

ఇక సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి న్యూజిలాండ్‌.. పాకిస్తాన్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టాయి. ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఈ రెండు జట్లలో ఏది గెలిచినా టి20 ప్రపంచకప్‌లో కొత్త విజేతను చూస్తాం. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ కివీస్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. '' ఈ ప్రపంచకప్‌లో టాస్‌ కీలకంగా మారింది. సాధారణంగా క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అంటారు.. కానీ ఇక్కడ మాత్రం టాస్‌ విన్‌ మ్యాచ్‌స్‌ లాగా తయారైంది. కీలకమైన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో అటు కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. ఇటు ఆసీస్‌ ఆరోన్‌ ఫించ్‌ ఇద్దరు టాస్‌ గెలిచి సగం మ్యాచ్‌ గెలిచారు. కానీ ఇది ప్రతీసారి జరగకపోవచ్చు. ఇక ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌ చేరిన సందర్భాల్లో ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుంది. కానీ న్యూజిలాండ్‌ తక్కువ అంచనా వేస్తే ఆసీస్‌కు ప్రమాదం. మొత్తానికి మ్యాచ్‌ మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Daryl Mitchell-Marcus Stoinis: 12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement