
Virat Kohli- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లి కంటే కూడా రోహిత్ గొప్ప టెస్టు కెప్టెన్ అవుతాడని పేర్కొన్నాడు. కాగా కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన హిట్‌మాన్ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు. రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో వరుసగా న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్‌లను వైట్‌వాష్ చేసింది.
ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. రోహిత్ శర్మను కొనియాడాడు. ‘‘రోహిత్ ఎన్ని టెస్టులకు సారథ్యం వహిస్తాడో తెలియదు కానీ.. విరాట్ కోహ్లి కంటే అతడు మెరుగైన టెస్టు కెప్టెన్ అవుతాడు. వరుస సిరీస్‌లను వైట్‌వాష్ చేయడం చూస్తున్నాం.
రోహిత్ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలవడం ఖాయం. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ప్రస్తుతం సరైన వ్యక్తి చేతిలో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా 68 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించి 40 విజయాలు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి టీమిండియా అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందాడు. ఇక 34 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.
చదవండి: Pak Vs Aus 2nd Test: బాబర్ ఆజమ్ సెంచరీ.. సూపర్ అంటూ అశ్విన్ ట్వీట్
CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W
— BCCI (@BCCI) March 14, 2022