శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తొలి వన్డేను టైగా ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. భారత హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి కాగా.. టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత రోహిత్ శర్మకు కూడా మొదటి పరాజయం.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోందని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
"ఈ సిరీస్‌లో శ్రీలంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కచ్చితంగా ఈ సిరీస్ విజయానికి వారే అర్హులు. అయితే భారత్ సిరీస్ ఓడిపోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. ఆటలో గెలుపు ఓటములు సహజమే.
కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇటువంటి ప్రదర్శన కనబరిచడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీకి ముందు భారత్ కేవలం మూడు వన్డేల మాత్రమే ఆడనుందని" ఎక్స్‌లో జాఫర్ రాసుకొచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భారత్‌కు ఇంకా కేవలం మూడు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ భారత్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment