టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఐపీఎల్‌లో తన ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్టును ప్రకటించాడు. తన జట్టుకు ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న జాఫర్.. క్రిస్‌గేల్, మలింగ వంటి దిగ్గజాలకు చోటిచ్చాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లుగా ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యాకు తన జట్టులో స్థానం కల్పించాడు.
కాగా ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభానికి ముందు వరుస వైఫల్యాలతో విమర్శలకు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు పూర్వవైభవం తెచ్చిపెట్టింది.
ఈ క్రమంలో ఐపీఎల్-2022తో పాటు మెగా టోర్నీలో తమ ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్లను మాజీ ఆటగాళ్లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా వసీం జాఫర్ క్రిక్‌ట్రాకర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఓపెనర్లుగా గేల్, కేఎల్ రాహుల్, వన్‌డౌన్లో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, ధోని.. ఆల్‌రౌండర్లుగా రసెల్, పాండ్యా.. బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్, అశ్విన్/చహల్, బుమ్రా, మలింగాకు తన జట్టులో స్థానం ఇచ్చాడు. అయితే, ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మకు మాత్రం వసీం చోటివ్వలేదు.
వసీం జాఫర్ ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్:
క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్/యజువేంద్ర చహల్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.
Comments
Please login to add a commentAdd a comment