ఐపీఎల్-2024 తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరింత పెంచేందుకు వరల్డ్‌కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుకు రానుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.
ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
వికెట్ కీపర్ కోటాలో
తన జట్టులో టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చిన జాఫర్.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు స్థానం కల్పించాడు. కేఎల్ రాహుల్‌కు మాత్రం మొండిచేయి చూపాడు.
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను ఎంచుకున్న వసీం జాఫర్.. నయా ఫినిషర్ రింకూ సింగ్‌ను కూడా ఎంపిక చేసుకున్నాడు.
అదే విధంగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, పేస్ దళంలో నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈ టీమిండియా మాజీ క్రికెటర్ చోటిచ్చాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.
టీ20 ప్రపంచకప్-2024కువసీం జాఫర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment