పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా(PC: IPL)
IPL 2022 Mega Auction- Punjab Kings: ఐపీఎల్- 2022 మెగా వేలం ముందు పంజాబ్ కింగ్స్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు నుంచి వసీం జాఫర్ తప్పుకున్నాడు. అయితే జాఫర్ ఈ విషయాన్ని తనదైన శైలిలో ప్రకటించాడు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా నుంచి ఓ మీమ్‌ను షేర్ చేస్తూ ఫ్రాంఛైజీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. "పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇన్ని రోజులు కలిసి పని చేసినందుకు సంతోషంగా ఉంది. రాబోయే సీజన్‌లో అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను.
పంజాబ్ కింగ్స్‌కు ఆల్‌ది బెస్ట్" అని జాఫర్ ట్వీట్ చేశాడు ఇక రంజీ ట్రోఫీలో 150 మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా జాఫర్ నిలిచిన సంగతి తెలిసిందే. 2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జాఫర్ 2021 సీజన్ వరకు కొనసాగాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్, అర్షదీప్‌ను రీటైన్ చేసుకుంది. మరో వైపు పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుంది.
చదవండి: Ind Vs WI 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. మార్పులతో బరిలోకి టీమిండియా!
Adios, and thank you @PunjabKingsIPL, it's been a pleasure. Wishing @anilkumble1074 and the team very best for #IPL2022 🤗 pic.twitter.com/rDivb0akZp
— Wasim Jaffer (@WasimJaffer14) February 10, 2022
Comments
Please login to add a commentAdd a comment