IPL 2022: Wasim Jaffer Hilarious Tweet Explain Punjab Kings Selection Dilemma - Sakshi
Sakshi News home page

IPL 2022: 'ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు!'

Published Fri, Apr 8 2022 7:40 PM | Last Updated on Fri, Apr 8 2022 8:24 PM

IPL 2022 Wasim Jaffer Hillarious Tweet Explain Punjab Kings Slection Dilemma - Sakshi

Courtesy: IPL Twitter

టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఫన్నీ ట్వీట్స్‌ చేయడంలో ఎప్పుడు ముందు ఉంటాడు. ఐపీఎల్‌ 2022 జరుగుతుండడంతో ప్రస్తుతం వసీం జాఫర్‌ క్రికెట్‌ అనలిస్ట్‌గా బిజీ అయిపోయాడు. మ్యాచ్‌కు ముందు ఎవరు ఫెవరెట్‌ అనేది వివరిస్తున్న జాఫర్‌ తాజాగా ఒక ఫన్నీ ట్వీట్‌ చేశాడు. విషయంలోకి వెళితే.. శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌కు పంజాబ్‌ కింగ్స్‌కు విదేశీ ఆటగాళ్ల సెలక్షన్‌ పెద్ద తలనొప్పిగా మారింది. కొత్తగా జానీ బెయిర్‌ స్టో రావడం.. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. కగిసో రబాడ, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, బానుక రాజపక్స, ఓడియన్‌ స్మిత్‌, జాని బెయిర్‌ స్టో రూపంలో ఐదుగురు ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వసీం జాఫర్‌ హెరాపెరీ సినిమాలోని పాపులర్‌ సన్నివేశంతో పంజాబ్‌ జట్టును పోల్చాడు.

ఆ సన్నివేశంలో ఒక కారులో వెనుక సీటులో నలుగురికి మాత్రమే అవకాశం ఉంది.. కానీ అందులో ఐదుగురు కూర్చోవాలని ప్రయత్నిస్తారు. దీంతో అందులో ఒక వ్యక్తి  ప్రతీసారి కారు నుంచి కింద పడుతుంటాడు. అచ్చం పంజాబ్‌ కింగ్స్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ''ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు'' అంటూ సెటైర్‌ వేశారు. జాఫర్‌ షేర్‌ చేసిన ట్వీట్‌ నవ్వులు పూయిస్తుంది. 

చదవండి: Virat Kohli: ఎంత అందంగా గీశాడో.. కోహ్లి, అనుష్కల మతి పోవాల్సిందే!

IPL 2022: బీసీసీఐ కొత్త నిబంధన.. తీవ్ర నిరాశలో అభిమానులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement