
Courtesy: IPL Twitter
ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు వేసి 64 పరుగలిచ్చి ఒక్క వికెట కూడా పడగొట్టలేకపోయాడు. తద్వారా చెత్త రికార్డు నమోదు చేశాడు. 16 పరుగుల ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న హాజిల్‌వుడ్ ఐపీఎల్‌లో వికెట్ తీయకుండా ఎక్కువ పరుగులు సమర్పించుకున్న విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ జాబితాలో హాజిల్‌వుడ్ తొలి స్థానంలో నిలిచాడు.
ఇంతకముందు ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ మార్కో జాన్సెన్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చాడు. అంతకముందు 2021లో సీఎస్కే తరపున లుంగీ ఎన్గిడి ముంబై ఇండియన్స్‌పై 4 ఓవర్లలో 61 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అంతేకాదు ఆర్‌సీబీ తరపున కూడా ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ ప్రదర్శన హాజిల్‌వుడ్ పేరిట నిలిచింది. ఇంతకముందు షేన్ వాట్సన్ 2016లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 61 పరుగులు సమర్పించుకోగా.. 2019 సీజన్‌లో టిమ్ సౌథీ కేకేఆర్‌కు 61 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా హాజిల్‌వుడ్.. వాట్సన్, సౌథీలను దాటి తొలి స్థానంలో నిలిచి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
Courtesy: IPL Twitter
ఇంకో విషయమేంటంటే.. ఆర్‌సీబీ ఫ్రంట్‌లైన్ బౌలర్లైన సిరాజ్, హాజిల్‌వుడ్‌లు కలిసి ఆరు ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకున్నారు. ఇందులో హాజిల్‌వుడ్ 64 పరుగులు, సిరాజ్( 2 ఓవర్లలో 36 పరుగులు) ఉన్నాయి. ఈ దెబ్బకు సిరాజ్ మళ్లీ సెకండ్ స్పెల్ బౌలింగ్‌కు రాలేదు. ఇక హాజిల్‌వుడ్‌కు పంజాబ్ ఓపెనర్ బెయిర్ స్టో చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బెయిర్ స్టో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వరుసగా 4,6,6,4 బాది అతనికి పీడకలను మిగిల్చాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ కచ్చితంగా గెలవాల్సిందే. ఒక రకంగా ఆర్‌సీబీకి డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు.
చదవండి: సీఎస్‌కే షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన