ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో(57 బంతుల్లో 88, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిశాడు. ఒక దశలో 30 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసిన డుప్లెసిస్.. మిగతా 71 పరుగులు కేవలం 27 బంతుల్లోనే సాధించాడు. అతని విధ్వంసం ఎలా సాగిందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలోనే తొలిసారి కెప్టెన్‌గా దంచికొట్టిన డుప్లెసిస్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు.
ఐపీఎల్ కెరీర్‌లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్న డుప్లెసిస్.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా వార్నర్‌తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. 3 వేల పరుగులు చేయడానికి డుప్లెసిస్ 94 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక తొలి స్థానంలో క్రిస్ గేల్( 75 ఇన్నింగ్స్‌లు), కేఎల్ రాహుల్(80 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో.. సురేశ్ రైనా 103 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment