Shreyas Iyer: అయ్యర్‌ అద్భుతం.. ఐదో స్థానానికి పర్‌ఫెక్ట్‌! | Ind Vs Nz Test: Wasim Jaffer Lauds Shreyas Iyer Suitable For No 5 Spot | Sakshi
Sakshi News home page

Shreyas Iyer: అయ్యర్‌ అద్భుతం... ఐదో స్థానానికి పర్‌ఫెక్ట్‌..తనలో నచ్చే విషయం అదే!

Published Fri, Nov 26 2021 2:36 PM | Last Updated on Fri, Nov 26 2021 3:07 PM

Ind Vs Nz Test: Wasim Jaffer Lauds Shreyas Iyer Suitable For No 5 Spot - Sakshi

PC: BCCI

Ind Vs Nz Test 2021: Wasim Jaffer Lauds Shreyas Iyer Suitable For No 5 Spot: ‘‘ముంబై నుంచి మరో బ్యాటర్‌. నాకెంతో సంతోషంగా ఉంది. భారత్‌ 345 స్కోరు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం నిజంగా ఆనందాయకం’’అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.. శ్రేయస్‌ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. సహజమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడన్నాడు. కాగా కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన శ్రేయస్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌... 171 బంతులు ఎదుర్కొని 105 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని జట్టు 345 పరుగులు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... శ్రేయస్‌ అయ్యర్‌ను ప్రశంసించాడు. ‘‘తనదైన శైలిలో ఆడాడు. అరంగేట్ర టెస్టు అయినా ఏమాత్రం తడబడలేదు.

తనలో నాకు నచ్చిన విషయం అదే. దేశవాళీ టోర్నీల్లోనూ తను అద్భుతంగా రాణించాడు. విజయ్‌ హజారే ట్రోఫీ.. రంజీ ట్రోఫీ.. టోర్నీ ఏదైనా సరే తన ఏకాగ్రతలో మార్పు ఉండదు’’ అంటూ కొనియాడాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తప్పక పరుగులు తీస్తాడని.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదో స్థానానిని శ్రేయస్‌ సూట్‌ అవుతాడని వసీం జాఫర్‌ చెప్పుకొచ్చాడు. ఇక కివీస్‌తో మొదటి టెస్టులో భాగంగా... టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక అయ్యర్‌ వికెట్‌ను టిమ్‌ సౌథీ తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: Trolls On Wriddhiman Saha: ఏం ఆడుతున్నావయ్యా బాబూ.. ఇకనైనా భరత్‌ను తీసుకుంటారా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement