
Michael Vaughan on Virat Kohli’s Trumpet celebration: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసుకున్న సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్‌లో ఏకంగా 157 పరుగుల తేడాతో విజయం సాధించడం, అది కూడా 50 ఏళ్ల తర్వాత ఓవల్ గడ్డపై మ్యాచ్ గెలవడం ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది. అయితే, గతంలోనూ కోహ్లి ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఈసారి ఇంగ్లండ్ జట్టు ఫ్యాన్ బార్మీ ఆర్మీని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఫాక్స్ స్పోర్ట్స్ కోహ్లి సంబరాన్ని ‘క్లాస్‌లెస్’ అని అభివర్ణించడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది. అంతేకాదు.. క్రికెట్ రైటర్ లారెన్స్ బూత్, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ రిక్ కాంప్టన్ సైతం.. ‘‘అంత అవసరం లేదు. కోహ్లి స్థాయికి ఇది తగదు’’ అంటూ విమర్శించారు. అయితే, ఎల్లపుడూ టామ్ అండ్ జెర్రీలా ట్విటర్ వార్ సాగించే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ విషయంలో మాత్రం ఒకే తరహాలో స్పందించడం విశేషం.
చదవండి: Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్ అంతా: ఇంగ్లండ్ కోచ్
కోహ్లి సెలబ్రేషన్స్‌పై స్పందించిన వసీం జాఫర్..‘‘కెప్టెన్ ధైర్యవంతుడు. చేజారుతుందనుకున్న మ్యాచ్‌కు జీవం పోసి.. చారిత్రాత్మక విజయం సాధించిన విరాట్ కోహ్లి జట్టును ప్రపంచమంతా కొనియాడుతోంది. నీకైతే ఇది ఫిక్స్ అయిపోయింది’’ అంటూ ఫాక్స్ క్రికెట్ కామెంట్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇక మైకేల్ వాన్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి గొప్ప నాయకుడు.
ట్రంపెట్ వాయిస్తున్నట్లుగా సంజ్ఞలు చేయడం ద్వారా బార్మీ ఆర్మీని సరదాగా టీజ్ చేశాడంతే. నాకు తన ఆటిట్యూట్ చాలా నచ్చింది. ఎనర్జీకి మారుపేరుగా ఉంటాడు. మాస్టర్‌క్లాస్ టెక్నిక్, ప్రణాళికాబద్దమైన వ్యూహాలతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు’’ అని కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే.. బార్మీ ఆర్మీ సైతం కోహ్లి సెలబ్రేషన్‌పై తనదైన శైలిలో స్పందించింది. ‘‘నువ్వు కూడా మా ఆర్మీలో చేరాలని కోరుకుంటున్నావని మాకు అర్థమైంది విరాట్. మాకు హింట్ ఇచ్చావుగా..’’ అంటూ సరదాగా కామెంట్ చేసింది.
చదవండి: Shikhar Dhawan Divorce: విడాకులు తీసుకున్న టాప్-4 జంటలు
Comments
Please login to add a commentAdd a comment