IND vs NZ 2021 1st Test: Wasim Jaffer Picks India XI for the First Test Against New Zealand - Sakshi
Sakshi News home page

IND vs NZ Test Series: కివీస్‌తో టెస్టు... సూర్యకుమార్‌ వద్దు.. శ్రేయస్‌కు చోటు!

Published Wed, Nov 24 2021 10:49 AM | Last Updated on Wed, Nov 24 2021 9:15 PM

IND vs NZ Test Series: Wasim Jaffer Picks India XI for Test Against New Zealand - Sakshi

IND vs NZ Test Series- Wasim Jaffer India XI for First New Zealand Test: ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. నవంబరు 25 నుంచి కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు ఆడేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో గాయం కారణంగా స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేశారు. ఇక ఇప్పటికే తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఓడి టైటిల్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించిన భారత్‌.. మెగా ఫైనల్‌ తర్వాత కివీస్‌తో ఆడుతున్న తొలి సిరీస్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ తన ఫేవరెట్‌ ఎలెవన్‌ టెస్టు జట్టును ప్రకటించాడు. మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్న అతడు... ఆ తర్వాతి స్థానాల్లో ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానేలు పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇక ఐదో స్థానానికి శ్రేయస్‌ అయ్యర్‌ పేరును సూచించాడు.

 

బౌలర్ల విషయానికొస్తే... మూడు స్పిన్నర్లను ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వసీం జాఫర్‌ పేర్కొన్నాడు. ఇక సూర్యకుమార్‌కు ఇప్పుడే పిలుపు వచ్చిందని.. అతడి గురించి మాట్లాడటం తొందరపాటే అవుతుందని చెప్పుకొచ్చాడు. కాగా తొలి టెస్టులో భాగంగా శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాలున్న నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

న్యూజిలాండ్‌తో టెస్టుకు వసీం జాఫర్‌ ఎంచుకున్న భారత జట్టు: 
మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌.

చదవండి: Ban Vs Pak: బంగ్లాదేశ్‌కు వరుస షాకులు.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం.. మరో కీలక ఆటగాడు సైతం
WTC 2023: షెడ్యూల్‌, పాయింట్లు, ర్యాంకులు ఇలా: ఐసీసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement