![IPL 2021: Wasim Jaffer After Punjab Kings Massive Win Mumbai Indians - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/24/Wasim-Jaffer.jpg.webp?itok=TTQ1oz5t)
చెన్నై: తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టినట్టే కనిపిస్తోంది. ఇక్కడి చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టుపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ విజయం సాధించడంతో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తన సంతోషాన్ని ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు.
తొలుత ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేసి... ఆ తర్వాత ఛేజింగ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుని ముందుండి చివరి వరకు నడిపించాడు. ఈ టోర్నిలో మొదటి మ్యాచ్ విజయం తరువాత హ్యాట్రిక్ పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌కిది రెండో విజయం. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించడంతో ఆ సంతోషాన్ని జాఫర్ ట్వీట్ రూపంలో వ్యక్త పరిచాడు. పంజాబ్ కింగ్స్ జట్టు లోగో అయిన సింహం ఫోటోను పోస్ట్ చేసి దానిపై క్యాప్షన్‌ను ఇలా పెట్టాడు. "జబ్ షికార్ కార్తే హై, బాడా హీ కార్టే హై ( సింహం వేట మొదలుపెడితే, పెద్దవాటినే వేటాడుతుంది) అంటూ రాశాడు. సాధారణంగా వసీం జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. భారత క్రికెటర్లలో సెహ్వాగ్ లానే జాఫర్ కూడా తనదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతు నెటిజన‍్లను ఆకట్టుకుంటాడు.
అంతకుముందు, ముంబై ఇండియన్స్‌ను ఓడించిన తరువాత, పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్, ఈ సీజన్లో మూడవ ఓటమిని చవిచూసినప్పటికీ, రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానంలో చోటు దక్కింది.
( చదవండి: తన శైలికి భిన్నంగా ఆడుతున్నాడు.. అందుకే )
#PBKSvMI #IPL2021 pic.twitter.com/VfjZiilT8h
— Wasim Jaffer (@WasimJaffer14) April 23, 2021
Comments
Please login to add a commentAdd a comment