chidambaram stadium
-
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
IPL 2024: ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారు
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని వేదిగా నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్లు అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక కాదని తేలిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుందని తెలుస్తుంది. మరో ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లు మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోం గ్రౌండ్‌లోనే ఆరంభ మరియు ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇదే సంప్రదాయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ సీజన్‌కు కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత్‌లోనే అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియం కావడంతో ఇక్కడ ఫైనల్ జరిగితే బాగుంటుందని కొందరు పెద్దలు అభిప్రాయపడినప్పటికీ.. గవర్నింగ్ బాడీ అంతిమంగా చెన్నైనే ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ (మార్చి 24) మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్, లక్నో జట్లు (జైపూర్) తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్) ఢీకొట్టనున్నాయి. -
నిఘా నీడలో చేపాక్కం!
సాక్షి, చైన్నె : ప్రపంచకప్ పోటీల్లో భాగంగా చైన్నె చేపాక్కం స్టేడియం వేదికగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్‌లో తడపడనున్నాయి. ఇందుకోసం చేపాక్కంలో సర్వం సిద్ధం చేశారు. ఆ పరిసరాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాలు.. తమిళనాట క్రికెట్ అభిమానం మరీ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. చైన్నె చేపాక్కంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగితే చాలు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో చైన్నె చేపాక్కం స్టేడియం ఐదు మ్యాచ్‌లకు వేదికగా మారనుంది. ఇందులో భారత్ జట్టు ఓ మ్యాచ్ మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ఆదివారం డే అండ్ నైట్ పోటీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి. సుమారు 40 మంది వరకు వీక్షించేందుకు ఈ స్టేడియంలో వీలుంది. తరలి వచ్చే అభిమానుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. అలాగే చేపాక్కం పరిసరాల్లో ట్రాఫిక్ మార్పులు జరిగాయి. అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు అదనంగా ఎంఆర్టీఎస్ రైలు సేవలు నడుపనున్నారు. మెట్రో రైలు సేవలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం మరమ్మతుల కారణంగా తాంబరం – బీచ్ మధ్య ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు ఆగుతుండటంతో ఆ పరిసరాల నుంచి వచ్చే అభిమానులను బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే స్టేడియం పరిసరాలు వివిధ వర్ణాల పెయింటింగ్స్‌తో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు స్టేడియంలోకి వెళ్లేందుకు వీలుగా ఆయా మార్గాల నుంచే బారికేడ్లను ప్రవేశ మార్గం వరకు ఏర్పాటు చేశారు. నిఘా కట్టుదిట్టం.. ఈ స్టేడియంలో ఆదివారం భారత్, ఆసీస్ మ్యాచ్‌తో పాటు 13వ తేదీన న్యూజిలాండ్ – బంగ్లాదేశ్, 18న న్యూజిలాండ్ – ఆఫ్గానిస్తాన్, 23న పాకిస్తాన్ – ఆప్గానిస్తాన్, 27న పాకిస్తాన్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య చైన్నె వేదికగా మ్యాచ్‌లు జరనున్నాయి. దీంతో మ్యాచ్‌లు జరిగే రోజుల్లో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మార్పుల ప్రకటన వెలువడింది. అలాగే స్టేడియం పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. 2 వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. ఈ పరిసరాలలోని నిఘా నేత్రాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే పోర్టబుల్ వాకింగ్ కెమెరాలను రంగంలోకి దించారు. ఈ కెమెరాలు మనుషుల తరహాలో నడుచుకుంటూ వెళ్లి వీడియో చిత్రీకరిస్తున్నాయి. స్టేడియానికి వచ్చే మహిళా అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకభద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన పక్షంలో కటకటాల్లోకి నెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినా, వర్షం బెంగ అభిమానులను వెంటాడుతోంది. గత రెండు మూడు రోజులుగా చైన్నెలో మధ్యాహ్నం, సాయంత్రం వేళవ్వో అక్కడక్కడ వర్షం పడుతోంది. శనివారం సాయంత్రం కూడా వర్షం కురవడంతో ఆదివారం వర్షం మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. -
చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలిటెస్టుపై ఫిక్సింగ్ అనుమానాలు?
గతేడాది ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరిలో టీమిండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఇంగ్లండ్ టీమిండియాతో నాలుగు టెస్టులు, ఐదు టి20, మూడు వన్డేలు ఆడింది. కాగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అనూహ్యంగా టీమిండియా తొలి టెస్టులో ఓడిపోయింది. ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుందంటే పిచ్ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుంది. కానీ తొలి టెస్టు మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. డొమినిక్ సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 178 పరుగులకే ఆలౌట్ కావడంతో .. భారత్ ముందు 433 పరుగుల టార్గెట్ ఉంది. కానీ టీమిండియా తమ వికెట్లు కాపాడుకోలేక 192 పరుగులకి ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్‌పై.. పిచ్ తయారు చేసిన క్యురేటర్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ ఫలితం తర్వాత చెపాక్ స్టేడియం పిచ్ క్యూరేటర్‌ని ఆ పదవి నుంచి తొలగించిన బీసీసీఐ కొత్త క్యూరేటర్‌ని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా అని సమాచారం. ముఖ్యంగా పిచ్ క్యూరేటర్ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తొలి టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్, పిచ్ క్యూరేటర్‌ని కలిసి పిచ్ ఎలా తయారుచేయాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చారు...మ్యాచ్‌కి ముందు రోజు సాయంత్రం అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి చెపాక్‌లోని చిదంబరం స్టేడియానికి వెళ్లారు...క్యూరేటర్‌కి, గ్రౌండ్‌మెన్‌కి పిచ్ ఎలా తయారుచేయాలో సూచించారు. పిచ్ ఎలా ఉందో అలా వదిలేయాలని నీళ్లు కొట్టడం కానీ, రోలర్ వాడడం కానీ చేయకూడదని తెలిపారు...అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్‌కి నీళ్లు కొట్టిన క్యూరేటర్, రోలర్ కూడా వాడారు. దీంతో పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా మారి, మొదటి రెండు రోజులు బౌలర్లకు ఏ మాత్రం సహకరించలేదు...బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్యూరేటర్... పిచ్‌పై నీళ్లు కొట్టి, రోలర్ ఎందుకు వాడాడు? కావాలని టీమిండియాకి విరుద్ధంగా రిజల్ట్ రావాలని ఈ విధంగా చేశాడా?లేక మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా? అనేది తేల్చేందుకు బీసీసీఐ విచారణ జరపాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా మళ్లీ చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో మాత్రం టీమిండియా విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీయగా, టెస్టు ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో భారత జట్టు 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మూడు, నాలుగు టెస్టులు వరుసగా గెలిచిన టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: Shane Warne- Ricky Ponting: వార్న్‌ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్ WTC Points Table: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఎన్నో స్థానంలో ఉందంటే -
PBKs Vs MI: సింహం వేట మొదలెడితే.. ఇలాగే ఉంటుంది!
చెన్నై: తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టినట్టే కనిపిస్తోంది. ఇక్కడి చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టుపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ విజయం సాధించడంతో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తన సంతోషాన్ని ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు. తొలుత ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేసి... ఆ తర్వాత ఛేజింగ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుని ముందుండి చివరి వరకు నడిపించాడు. ఈ టోర్నిలో మొదటి మ్యాచ్ విజయం తరువాత హ్యాట్రిక్ పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌కిది రెండో విజయం. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించడంతో ఆ సంతోషాన్ని జాఫర్ ట్వీట్ రూపంలో వ్యక్త పరిచాడు. పంజాబ్ కింగ్స్ జట్టు లోగో అయిన సింహం ఫోటోను పోస్ట్ చేసి దానిపై క్యాప్షన్‌ను ఇలా పెట్టాడు. "జబ్ షికార్ కార్తే హై, బాడా హీ కార్టే హై ( సింహం వేట మొదలుపెడితే, పెద్దవాటినే వేటాడుతుంది) అంటూ రాశాడు. సాధారణంగా వసీం జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. భారత క్రికెటర్లలో సెహ్వాగ్ లానే జాఫర్ కూడా తనదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతు నెటిజన్లను ఆకట్టుకుంటాడు. అంతకుముందు, ముంబై ఇండియన్స్‌ను ఓడించిన తరువాత, పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్, ఈ సీజన్లో మూడవ ఓటమిని చవిచూసినప్పటికీ, రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానంలో చోటు దక్కింది. ( చదవండి: తన శైలికి భిన్నంగా ఆడుతున్నాడు.. అందుకే ) #PBKSvMI #IPL2021 pic.twitter.com/VfjZiilT8h — Wasim Jaffer (@WasimJaffer14) April 23, 2021 -
భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్; మనవైపు తిరుగుతుందా!
నాలుగేళ్ల క్రితం భారత జట్టు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ తొలి టెస్టులో అనూహ్యంగా ఓడింది. అయితే వెంటనే కోలుకొని తర్వాతి టెస్టును, ఆపై సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఇప్పుడు కూడా టీమిండియా సరిగ్గా అలాంటి స్థితిలోనే నిలిచింది. ఇంకా చెప్పాలంటే గత 22 ఏళ్లలో స్వదేశంలో భారత్ ఎప్పుడూ వరుసగా రెండు టెస్టులు ఓడలేదు. తొలి టెస్టు పరాభవాన్ని వెనక్కి తోసి కోహ్లి సేన మరింత పట్టుదలతో చెలరేగితే ఈ మ్యాచ్‌లో తుది ఫలితం మారవచ్చు. మరోవైపు ఇంగ్లండ్ కూడా తమకు దక్కిన ఆధిక్యాన్ని చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. వేదిక అదే అయినా మరో పిచ్‌పై మ్యాచ్ జరుగుతుండటం, దానిపై తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరుగుతుందని వినిపిస్తున్న నేపథ్యంలో ఏ జట్టు స్పిన్నర్లు ఎలా వాడుకుంటారనేది ఆసక్తికరం. అయితే మన జట్టుకు అనుకూలంగా తయారు చేయిస్తున్న స్పిన్ పిచ్ 2017 తరహాలో మనకే వ్యతిరేకంగా ‘బూమరాంగ్’ కాకుంటే మంచిది! చెన్నై: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పరాజయాన్ని మరచి కోహ్లి సేన మరో సమరానికి సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇక్కడి ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలవాల్సిన భారత్ దానిని ఇక్కడే మొదలు పెట్టాల్సి ఉంది. మరోవైపు ఈ టెస్టునూ నెగ్గితే సిరీస్ చేజార్చుకునే ప్రమాదం నుంచి రూట్ సేన సురక్షితంగా బయపడుతుంది. అయితే తొలి మ్యాచ్ జోరును ఇంగ్లండ్ ఇక్కడా కొనసాగించగలదా అనేది చూడాలి. కరోనా కాలం తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అభిమానులు మైదానంలోకి అడుగు పెట్టనున్నారు. అక్షర్ పటేల్‌కు చోటు... అశ్విన్ మినహా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం కూడా తొలి టెస్టులో భారత జట్టు పరాజయానికి కారణాల్లో ఒకటి. ఆ మ్యాచ్‌కు అనూహ్యంగా గాయపడి ఆటకు దూరమైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. అతను టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ ఆడతాడు. అయితే కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటుపైనే ఉత్కంఠ నెలకొంది. గత మ్యాచ్‌లాగే బ్యాటింగ్ అవసరమని భావిస్తే వాషింగ్టన్ సుందర్ తన స్థానం నిలబెట్టుకుంటాడు. మిగిలిన జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగనుంది. కొన్నాళ్ల క్రితం దక్షిణాఫ్రికాపై తొలిసారి ఓపెనర్‌గా ఆడినప్పుడు చెలరేగిన రోహిత్ శర్మ మరోసారి భారీగా పరుగులు సాధించాలని జట్టు కోరుకుంటోంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూకుడైన బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. సొంత మైదానంలో సత్తా చాటిన అశ్విన్ దానిని పునరావృతం చేయాలని కోరుకుంటున్నాడు. సీనియర్ పేసర్లు ఇషాంత్, బుమ్రా అందుబాటులో ఉండటంతో మరోసారి హైదరాబాద్ బౌలర్ సిరాజ్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. దాదాపు అదే జట్టు ఆడుతోంది కాబట్టి తొలి టెస్టు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే టీమిండియా మరోసారి తన స్థాయిని ప్రదర్శించగలదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), గిల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, బుమ్రా, సుందర్/ కుల్దీప్. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లీ, బర్న్స్, లారెన్స్, స్టోక్స్, పోప్, ఫోక్స్, అలీ, బ్రాడ్, లీచ్, వోక్స్/స్టోన్. పిచ్, వాతావరణం తొలి టెస్టుతో పోలిస్తే భిన్నమైన పిచ్. మొదటి రోజు నుంచే స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అయితే ఐదు రోజులు ఇలాంటి పిచ్ మనగలదా అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో టాస్ మరోసారి కీలకం కానుంది. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు. నాలుగు మార్పులతో... ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు తమ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయంలో సీనియర్ పేసర్ అండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో వేసిన అద్భుత స్పెల్ పాత్ర ఎంతో ఉంది. ఆ ప్రదర్శన అనంతరం రెండో టెస్టులో కూడా తాను ఆడాలని ఉత్సాహంగా ఉన్నట్లు అండర్సన్ చెప్పాడు. అయితే ఇంగ్లండ్ బోర్డు మాత్రం తమ ‘రొటేషన్ పాలసీ’ని ఏమాత్రం మార్చేది లేదని కచ్చితంగా చెప్పేసింది. అతని స్థానంలో మరో సీనియర్ స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వస్తాడు. గాయపడ్డ ఆర్చర్ స్థానంలో అదే స్థాయి వేగంతో బౌలింగ్ చేసే ఒలీ స్టోన్ లేదా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్లలో ఒకరు జట్టులోకి వస్తారు. బట్లర్ తిరిగి స్వదేశం వెళ్లడంతో ఫోక్స్ వికెట్ కీపర్‌గా జట్టులోకి రాగా... బెస్ స్థానంలో మొయిన్ అలీకి అవకాశం లభించింది. అయితే ఈసారి కూడా ఇంగ్లండ్ అవకాశాలు రూట్ బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. -
ధోని@ 6, 6, 6, 6 ,6
చెన్నై : మహేంద్ర సింగ్ ధోనీ తన బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. వరుసగా 5 బంతులను ఐదు సిక్సులుగా మలిచి బ్యాటింగ్ పవరేంటో చూపించాడు.దీంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్టేడియం దద్దరిల్లింది. అదేంటీ... ధోనీ ఎప్పుడు మ్యాచ్ ఆడాడు.. ఎప్పుడు సిక్స్‌లు కొట్టాడనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. మరో మూడు వారాల్లో 13 ఐపీఎల్ సీజన్ మొదలవనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. కాగా సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చిదంబరం స్టేడియంలో తన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మహీ నెట్స్‌లోనే నిలబడి వరుసగా 5 బంతులను సిక్స్‌లుగా మలిచి స్టాండ్స్‌లోకి పంపాడు. అయితే బౌలర్ ఆ బంతులు వేశాడా లేక బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను సిక్స్‌లుగా కొట్టాడా అనేది తెలియదు.(భజ్జీ ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఇదే..) ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ తమిళ స్టార్‌స్పోర్ట్స్ చానెల్ తమ ట్విటర్లో షేర్ చేసింది. అయితే 38 ఏళ్ల ధోనీలో ఇంకా బ్యాటింగ్ పవర్ తగ్గలేదని మాత్రం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ 13 సీజన్లో తన ప్రదర్శన చూపించాలనే ఆసక్తిలో ధోనీ ఉన్నట్లు తెలుస్తుంది. మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్లో ధోనీ ప్రదర్శనను చూడాలని అతని అభిమానులు కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం మహీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ధోనిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కూడా తప్పించింది. దాదాపు 8నెలలు తర్వాత ఐపీఎల్ 13వ సీజన్ ద్వారా మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ధోనీ తన ఐపీఎల్ కెరీర్లో 190 మ్యాచులాడి 4432 పరుగులు చేశాడు. అందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో చెన్నైకి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై.. ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది. పదేళ్లు ఈ సీజన్లో ఆడిన చెన్నై.. పదిసార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకుని తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఈ జట్టును ముందుండి నడిపించడమే ఈ విజయ పరంపరకు అసలు కారణం. మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ('కష్టకాలంలో నాకు అండగా నిలిచింది') BALL 1⃣ - SIX BALL 2⃣ - SIX BALL 3⃣ - SIX BALL 4⃣ - SIX BALL 5⃣ - SIX ஐந்து பந்துகளில் ஐந்து சிக்ஸர்களை பறக்கவிட்ட தல தோனி! முழு காணொளி காணுங்கள் 📹👇 #⃣ "The Super Kings Show" ⏲️ 6 PM 📺 ஸ்டார் ஸ்போர்ட்ஸ் 1 தமிழ் 📅 மார்ச் 8 ➡️ @ChennaiIPL pic.twitter.com/rIcyoGBfhE — Star Sports Tamil (@StarSportsTamil) March 6, 2020 -
ఎవరిదో శుభారంభం!
అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసాలు... విస్మయపరిచే బౌలర్ల ప్రదర్శనలు... కళ్లు చెదిరే బౌండరీలు... చుక్కలనంటేలా భారీ సిక్సర్లు... ఓవర్ ఓవర్‌కు మారే విజయ సమీకరణాలు.. వెరసి వెస్టిండీస్‌తో టి20 ఫార్మాట్ మజామజాగా సాగింది. ఇక రోజంతా క్రికెట్ కబుర్లు పంచేందుకు వన్డే ఫార్మాట్ సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఫామ్ దృష్ట్యా వన్డే సిరీస్‌లోనూ టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. చెన్నై: పుష్కర కాలంగా వెస్టిండీస్‌పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమైంది. తాజాగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకున్న కోహ్లిసేన అదే ఉత్సాహంతో వన్డే సిరీస్ విజయంపై గురి పెట్టింది. మరోవైపు భారత్ చేతిలో తమ పరాజయాల పరంపరకు కళ్లెం వేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది భారత్ జోరుకు బ్రేకులేసేందుకు విండీస్ సేన సిద్ధమైంది. ఇలా ఇరు జట్లు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతుంటే వరుణుడు నేనున్నానంటూ పలకరించాడు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా తుడిచి పెట్టుకుపోయింది. నేటి మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే వీలున్న నేపథ్యంలో మ్యాచ్ ఏవిధంగా సాగబోతుందోనన్న ఆసక్తి అందరిలో పెరిగింది. ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన... ఏ జట్టుకు అయినా సొంతగడ్డపై భారత్‌ను వన్డేల్లో ఓడించడం శక్తికి మించిన పనే. ఈ విషయం వెస్టిండీస్‌కు తెలిసినంత క్షుణ్ణంగా మరో జట్టుకు తెలిసి ఉండదేమో! ఇంకా చెప్పాలంటే గత కొన్నేళ్లుగా విండీస్ పరిస్థితి చూస్తుంటే ఏదో వచ్చామా? వెళ్లామా? అన్నట్లుగానే ఉంది. 2006–07 సీజన్ నుంచి ఇప్పటి వరకు భారత్‌లో ఆరుసార్లు పర్యటించిన విండీస్ ఖాళీ చేతులతోనే వెళ్లడం దీన్ని నిర్ధారిస్తోంది. ఈసారి కూడా వెస్టిండీస్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేందుకే భారత్ సిద్ధమైంది. దీనికి తగినట్లుగానే కోహ్లి, రోహిత్, రాహుల్‌లతో కూడిన భారత టాపార్డర్ దుర్భేద్యంగా ఉంది. గాయపడిన ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు... వన్డేల్లో అరంగేట్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ సమయంలో ఆందోళన రేకెత్తించిన నాలుగో నంబర్ స్థానంలో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కుదురుకుంటున్నట్లే కనబడుతున్నాడు. దూకుడు, నిలకడలేమితో విమర్శలెదుర్కొంటున్న యువ వికెట్‌కీపర్ పంత్‌కు ఈ సిరీస్ మరో మంచి అవకాశం. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని నిలిపేలా అతను మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో చురుగ్గా కదిలే రవీంద్ర జడేజా ఉండటం జట్టుకు పెద్ద సానుకూలాంశం. మనీశ్ పాండే కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. భువనేశ్వర్ స్థానంలో వచ్చిన శార్దుల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్ పేస్ విభాగాన్ని నడపనున్నారు. స్పిన్ విభాగంలో ‘కుల్చా’ ద్వయం మరోసారి జోడీ కట్టనుంది. చివరిసారిగా వన్డే ప్రపంచకప్‌లో కలిసి ఆడిన కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ చెపాక్ పిచ్‌పై తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించనున్నారు. కడవరకు నిలబడితేనే... దూకుడు, పవర్‌హిట్టింగ్‌కు మారుపేరు వెస్టిండీస్. వచ్చీరాగానే భారీ షాట్లతో విరుచుకుపడటం, బంతుల్ని బౌండరీలకు తరలించడమే లక్ష్యంగా ఆడతారు విండీస్ వీరులు. తాజా టి20 సిరీస్‌లోనూ వారు కురిపించిన సిక్సర్ల వాన అభిమానులను మురిపించింది. అయితే ఈ తరహా ఆట రోజంతా సాగే వన్డే ఫార్మాట్‌కు పనికిరాదు. ప్రస్తుతం దీనిపైనే విండీస్ దృష్టి సారించింది. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, వికెట్ కాపాడుకుంటూ కడవరకు క్రీజులో ఉండటమే లక్ష్యంగా ఆడతామని వెస్టిండీస్ సహాయక కోచ్ ఎస్ట్‌విక్ అన్నారు. ముంబై మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయడిన భారీ హిట్టర్ ఎవిన్ లూయిస్ నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. కెప్టెన్ పొలార్డ్, షై హోప్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, కింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ కూడా జట్టుతో చేరడంతో విండీస్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. పేసర్లు షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్.. స్పిన్నర్ జూనియర్ వాల్‡్ష భారత టాపార్డర్‌ను తొందరగా పెవిలియన్ పంపించేందుకు వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నప్పటికీ అనూహ్యమైన ఆటతీరుకు పెట్టింది పేరైన వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. జట్లు (అంచనా) భారత్: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, క్యారీ పియరీ, రోస్టన్ చేజ్, రొమారియో షెఫర్డ్, సునీల్ ఆంబ్రిస్, నికోలస్ పూరన్, హెట్‌మైర్, అల్జారీ జోసెఫ్, వాల్‡్ష జూనియర్, కీమో పాల్. పిచ్, వాతావరణం గత రెండు రోజులు వర్షం పడటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చివరిసారి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను 21 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడిపోయింది. ఆదివారం ఆకాశం మేఘావృతంగా ఉండటంతోపాటు వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. 12: చెన్నైలో భారత్ ఇప్పటివరకు 12 వన్డేలు ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. 4: ఈ వేదికపై వెస్టిండీస్‌తో భారత్ నాలుగుసార్లు తలపడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది (2011లో), మరో రెండు మ్యాచ్‌ల్లో (1994, 2007లో) ఓడిపోయింది. చివరిసారి ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. -
మ్యాచ్‌లో ధోని లేకపోయినా..
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని అక్కడి అభిమానులు తమ వాడిగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. పలు నగరాల్లోని ధోని అభిమానుల్లో చాలా మంది ఐపీఎల్లో ఆయన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కోరుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌పై గల ఇష్టాన్ని పలు సందర్భాల్లో, పలు రూపాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కు హాజరైన ధోని అభిమానులు అతడిపై వారికి గల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మ్యాచ్ జరుగుతుంది చెన్నై కావడంతో.. నేటి మ్యాచ్‌లో ధోని లేకపోయినప్పటికీ.. చాలా మంది ధోని పేరుతో ఉన్న టీ షర్ట్‌లను ధరించి మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చారు. -
చిదంబరం స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, చెన్నై : కావేరీ మేనేజ్మెంట్ బోర్డు వ్యవహారంపై తమిళనాడు రగిలిపోతుండగా.. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ తంబీలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నేటి సీఎస్కే-కేకేఆర్ మ్యాచ్‌ను అడ్డుకుని తీరతామన్న ఆందోళనకారులు.. స్టేడియాన్ని ముట్టడించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతున్నప్పటికీ.. భారీ భద్రత వలయాన్ని చేధించుకుంటూ ఆందోళనకారులు స్టేడియం వద్దకు దూసుకొస్తున్నారు. భారీ భద్రత నడుమ సీఎస్కే-కేకేఆర్ టీమ్ సభ్యులు మైదానంకు చేరుకున్నారు. స్టేడియం దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో తమిళ సంఘాలు స్టేడియం దగ్గర్లోని కూడలిలో ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం మైదానం వద్ద చోటుచేసుకున్న పరిస్థితులపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మ్యాచ్‌లను నిర్వహించేందుకు చెన్నై పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.(ఐపీఎల్ మ్యాచ్‌లు.. రాజకీయాలొద్దు) -
ఐపీఎల్ క్యూ
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీలను వీక్షించేందుకు ఉవ్విళ్లూరుతున్న అభిమానులు సోమవారం చెన్నై చేపాక్ స్టేడియం వద్ద భారీసంఖ్యలో క్యూ కట్టారు. ఐపీఎల్-8వ క్రికెట్ పోటీలు ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమై 24వ తేదీతో ముగుస్తాయి. 8 జట్లు తలపడే ఈ క్రికెట్ పోటీలు దేశంలోని 12 మైదానాల్లో సాగుతాయి. ఇందులో భాగంగా 9వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్-డిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య 7వ లీగ్ పోటీలకు చేపాక్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. అలాగే మరో మ్యాచ్‌లో సన్‌రైజస్-హైదరాబాద్ జట్లు 11వ తేదీన తలపడనున్నాయి. ఈ క్రికెట్ పోటీలను ప్రత్యక్షంగా తిలకించేవారి కోసం ఉదయం 9.30గంటలకు చేపాక్‌లోని ఏమ్ఏ చిదంబరం స్టేడియంలో టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించారు. స్టేడియం వద్ద తొక్కిసలాట లేకుండా స్టేడియం నిర్వాహకులు తాత్కాలిక క్యూలైన్లను నిర్మించారు. ఉదయం 6 గంటల నుండే క్రీడాభిమానులతో భారీ క్యూ ఏర్పడింది. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలో నిల్చుని టిక్కెట్లను దక్కించుకున్న అభిమానులు ఆనందంతో తమ టిక్కెట్లను ప్రదర్శిస్తూ కేరింతలు కొట్టారు. కనిషట టిక్కెట్టు ధర రూ.750 కాగా ఎక్కువ మంది ఇవే టిక్కెట్లను కొనుగోలు చేశారు. అలాగే ధనికులు, కార్పొరేట్ దిగ్గజాల కోసం గరిష్టధర రూ.15వేలుగా నిర్ణయించారు. వీటితో పాటూ రూ.1,500, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.6 వేల విలువైన టిక్కెట్లను అమ్మారు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు కొద్దిరోజుల ముందుగానే మొదలైనాయి. రాజకీయ కారణాల వల్ల గత ఏడాది చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ పోటీలు మరో రాష్ట్రానికి బదిలీ అయిపోగా, క్రీడాభిమానులు నిరాశకు గురైనారు. ఈ నేపథ్యంలో ఏడాది విరామం తరువాత దక్కిన అవకాశం కావడంతో వయసుతో నిమిత్తం లేకుండా క్రీడాభిమానులంతా 9వ తేదీ కోసం ఉరకలు వేస్తున్నారు. -
ఆదుకున్న అపరాజిత్, పాండే
చెన్నై: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టు కోలుకుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో వెస్ట్‌జోన్‌తో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సరికి సౌత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (131 బంతుల్లో 93 బ్యాటింగ్; 11 ఫోర్లు), మనీశ్ పాండే (118 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు కలిసి ఇప్పటికే నాలుగో వికెట్‌కు అభేద్యంగా 161 పరుగులు జోడించారు. అంతకు ముందు టాస్ గెలిచిన సౌత్ జోన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దులీప్ ట్రోఫీలో తొలి సారి తుది జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అక్షత్ రెడ్డి (23 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముకుంద్ (4), రాహుల్ (6) కూడా తొందరగానే అవుట్ కావడంతో 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సౌత్ జోన్ కష్టాల్లో పడింది. ఈ దశలో అపరాజిత్, పాండే జట్టును ఆదుకున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తొలి రోజు కేవలం 54 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.