
చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని అక్కడి అభిమానులు తమ వాడిగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. పలు నగరాల్లోని ధోని అభిమానుల్లో చాలా మంది ఐపీఎల్‌లో ఆయన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కోరుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌పై గల ఇష్టాన్ని పలు సందర్భాల్లో, పలు రూపాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆదివారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కు హాజరైన ధోని అభిమానులు అతడిపై వారికి గల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మ్యాచ్ జరుగుతుంది చెన్నై కావడంతో.. నేటి మ్యాచ్‌లో ధోని లేకపోయినప్పటికీ.. చాలా మంది ధోని పేరుతో ఉన్న టీ షర్ట్‌లను ధరించి మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment