
ఉమ్రాన్ మాలిక్
New Zealand vs India, 1st ODI- Umran Malik: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ టీ20 ఫార్మాట్‌లో కంటే వన్డేల్లోనే ఎక్కువ ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అత్యంత వేగంగా బంతులు విసరడంలో దిట్ట అయిన 23 ఏళ్ల ఉమ్రాన్ ఐర్లాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కివీస్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు.
వన్డేలకే సూట్ అవుతాడు!
ఆరంభంలో బాగానే బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఉమ్రాన్ మాలిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఎంత ఎక్కువ సేపు సాగితే అంత ఎక్కువగా మన నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీ20ల కంటే కూడా వన్డేల్లో ఇలా బౌలింగ్ చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఆట గురించి మరింత ఎక్కువగా అవగాహన పెంచుకునే ఆస్కారం ఉంటుంది. నిజానికి ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్ కంటే కూడా వన్డేలకే ఎక్కువగా సూట్ అవుతాడు. ఐపీఎల్‌లో అతడి బౌలింగ్‌ను గమనించాం.
నిజానికి అక్కడ(టీ20) తను వైవిధ్యం చూపలేకపోయాడు. సరైన లెంత్‌తో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే, వన్డే ఫార్మాట్‌లో తను ప్రయోగాలు చేసేందుకు, వైవిధ్యం ప్రదర్శించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు.
బౌలర్ల తప్పేం లేదు.. అర్ష్ భేష్
ఇక అర్ష్‌దీప్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆట తీరును మార్చుకోవండంలో అతడు దిట్ట. రోజురోజుకు నైపుణ్యాలు మెరుగుపరచుకుని మరింత రాటుదేలుతున్నాడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో మొదటి వన్డేలో అర్ష్ 8.1 ఓవర్లలో 68 పరుగులు ఇవ్వడం గమనార్హం.
కాగా కివీస్‌తో మొదటి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంపై స్పందిస్తూ.. ‘‘నిజానికి ఆ పిచ్ రాను రాను బ్యాటర్లకు మరింతగా అనుకూలించింది. ముఖ్యంగా కివీస్ ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో భారత బౌలర్లకు మరింత కష్టతరంగా మారింది’’ అంటూ టీమిండియా బౌలర్లను వెనకేసుకొచ్చాడు.
చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు
FIFA WC 2022: అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా
Comments
Please login to add a commentAdd a comment