ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ఇప్పడు టీ20 సిరీస్‌కు సిద్దమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా గురువారం జరగనుంది. ఇక రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగి భారత సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా తొలి టీ20కు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు, ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భాగమైన భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టే తొలి టీ20లో బరిలోకి దిగనుంది.
ఈ క్రమంలో తొలి టీ20కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టును ట్విటర్ వేదికగా జాఫర్ ప్రకటించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను జాఫర్ ఎంపిక చేశాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్‌లో దీపక్ హుడా, నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. తన జట్టులో ఫినిషర్‌లుగా హార్ధిక్ పాండ్యా, కార్తీక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక పేస్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్,భువనేశ్వర్ కుమార్,ఆవేష్ ఖాన్లకు చోటు దక్కింది. స్పిన్నర్లుగా చాహల్, బిష్ణోయ్‌లను ఎంపిక చేశాడు. అతడు ఎంచుకున్న జట్టులో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
వసీం జాఫర్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్
చదవండి: Sourav Ganguly Birthday: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్! సచిన్‌తో ఫొటో.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment