![When Match Becomes Tight, Pant will be Panics Says Wasim Jaffer - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/14/rishab.jpg.webp?itok=rVL3g0eH)
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడి సారథ్యంలోని టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లోను ఘోర పరాజాయం చవిచూసింది. ఇక మంగళవారం వైజాగ్ వేదికగా ప్రోటీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ చావోరేవో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ క్రమంలో పంత్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మ్యాచ్ క్లిష్టంగా మారినప్పుడు పంత్ కొంచెం ఒత్తిడికి గురవుతున్నాడు.
"ఐపీఎల్‌లో కూడా ఇది మనం చూశాం. అతడు మరిన్ని మ్యాచ్‌లకు సారధిగా వ్యవహరిస్తే.. మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను. కాగా దాదాపు ఈ సిరీస్ భారత్ చేతుల నుంచి జారిపోయింది. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో వెనుకబడి ఉన్నాం. మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా సిరీస్ వారి వశం అవుతోంది. ఇక రానున్న మ్యాచ్‌ల్లో టీమిండియా ఆద్భుతంగా ఆడాలి. . టాస్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు బ్యాటింగ్ చేసినా భారీ స్కోర్ సాధించాలి" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment