ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపాత్యం చెలాయిస్తోంది. బాజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లెర్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు రెండో రోజు లంచ్ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్‌కు చేరారు.
ఇక ఈ విషయం పక్కన పెడితే.. తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను చాలా ఫ్లాట్‌గా తాయారు చేశారని, బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్‌లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన స్టైల్‌లో స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను హైవేతో పోలుస్తూ జాఫర్ సెటైరికల్ ట్వీట్ చేశాడు.
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఫోటోను షేర్‌చేస్తూ.. "పిచ్‌ను దగ్గరగా చూడండి అంటూ" ట్విటర్‌లో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. . జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్
Closer look at the Edgbaston pitch #Ashes23 pic.twitter.com/0gNSMWdPim
— Wasim Jaffer (@WasimJaffer14) June 16, 2023
Comments
Please login to add a commentAdd a comment