EDGbaston
-
Ind vs Pak: ఫైనల్లో పాక్‌తో భారత క్రికెట్ జట్టు ఢీ! సై అంటే సై..
IBSA World Games 2023: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండ్ నేపథ్యంలో చంద్రునిపై భారత మువ్వన్నెల పతాకం గర్వంగా రెపరెపలాడిన సంతోషాన్ని యావత్ దేశం సంబరంగా జరుపుకొంటున్న తరుణంలో.. భారత అంధ క్రీడాకారులు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో సత్తా చాటారు. ప్రపంచ అంధ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడాకారుల పోటీలలో ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్నారు. మహిళా, పురుష జట్లు గత వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో భారత క్రీడాకారులు క్రికెట్ , జూడో , అథ్లెటిక్స్ విభాగంలో పాల్గొంటున్నారు. పురుషుల క్రికెట్లో భారత్ , ఇంగ్లండ్, పాకిస్తాన్ , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా .. మహిళల క్రికెట్ విభాగంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల జట్లు తలపడ్డాయి. ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ ఈ క్రమంలో.. పురుషుల క్రికెట్లో భారత్ నాలుగు లీగ్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఇక శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం నాటి ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత కాలమానం ప్రకారం 3:30 గంటలకు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకోనుంది. మహిళా జట్టు కూడా ఫైనల్‌కు మహిళల క్రికెట్ విభాగంలో భారత జట్టు మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆగష్టు 26 నాటి తుదిపోరులో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడనుంది . క్రీడాకారులకు అరకొర ఏర్పాట్లు యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న మన ప్రవాసాంధ్రులు ముఖ్యంగా సోలిహల్ యునైటెడ్ క్రికెట్ క్లబ్ (SUCC, UK) సభ్యులు కలిసి ఈ క్రికెట్ జట్టు సభ్యులందరికీ కావాల్సిన భోజనా-వసతి సదుపాయాలని సమకూరుస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రణవ గ్రూప్ కూడా వీరికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తగిన సహకారం అందిస్తే కాగా జట్టు యాజమాన్యం, ప్రభుత్వం మరింత బాధ్యతగా ఏర్పాట్లు చేసినట్లయితే ఇంకా అంధ క్రికెట్లో మనవాళ్లు ఎన్నో విజయాలు సాధిస్తారని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. 2012 నుంచి భారత పురుషుల జట్టు 3 సార్లు టీ20, రెండుసార్లు వన్డే ప్రపంచ కప్, ఒకసారి ఆసియ కప్ గెలిచి సత్తా చాటింది. ఎన్ని విజయాలు సాధించినా జట్టుకు, క్రీడాకారులకు తగినంత గుర్తింపు , ప్రోత్సాహం లభించడం లేదని క్రికెట్ అభిమానులు ఉసూరుమంటున్నారు. భారత పురుషుల అంధ క్రికెట్ జట్టు అజయ్ కుమార్‌రెడ్డి(కెప్టెన్), వెంకటేశ్వరరావు(వైస్ కెప్టెన్), బసప్ప వడ్డగోల్, మహ్మద్ జాఫర్ ఇక్బాల్, మహారాజా శివసుబ్రమణియన్, ఓంప్రకాశ్ పాల్, మరేశ్భాయిబలుభాయి తుంబ్డా, నీలేశ్ యాదవ్, పంకజ్ భుయే, రాంబీర్ సింగ్, నకుల బద్రానాయక్, ఇర్ఫాన్ దివాన్, ప్రకాశ జయరామయ్య, దీపక్మాలిక్, సునిల్ రమేశ్, దుర్గారావు తొంపాకి, దినేశ్భాయయి చమాయ్దాభాయి రాథ్వా. మహిళల క్రికెట్ జట్టు: వర్ష(కెప్టెన్), వలసనైని రావణ్ణి, సిము దాస్, పద్మినితుడు, కలికా సంధ్య, ప్రియ, గంగవ్వ నీలప్ప హరిజన్, సాండ్రా డేవిస్ కరిమలిక్కల్, బసంతి హన్స్దా, ప్రీతి ప్రసాద్, సుష్మా పటేల్, ఎం.సత్యవతి, ఫులాసరేన్(వైస్ కెప్టెన్), ఝిలిబిరువా, గంగా శంభాజీ కదం, దీపికా టీసీ. చదవండి: Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే? -
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ హైవేలా ఉంది.. జాఫర్ సెటైరికల్ ట్వీట్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపాత్యం చెలాయిస్తోంది. బాజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లెర్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు రెండో రోజు లంచ్ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్‌కు చేరారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను చాలా ఫ్లాట్‌గా తాయారు చేశారని, బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను హైవేతో పోలుస్తూ జాఫర్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఫోటోను షేర్చేస్తూ.. "పిచ్‌ను దగ్గరగా చూడండి అంటూ" ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. . జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ Closer look at the Edgbaston pitch #Ashes23 pic.twitter.com/0gNSMWdPim — Wasim Jaffer (@WasimJaffer14) June 16, 2023 -
Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లతో కలిసి గ్రూప్ ‘ఏ’లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలో మొదట ఆసీస్‌తో తలపడనున్న హర్మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. పాక్ జట్టు బార్బడోస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మరి భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా! జట్లు ఏవైనా దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్-2022లో మహిళా జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? లైవ్‌స్ట్రీమింగ్, జట్లు తదితర అంశాలు తెలుసుకుందాం! భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్: ►తేది: జూలై 31, 2022 ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభం ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్ ►ప్రసారాలు: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్ కీపర్), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగెస్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా. స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు: బిస్మా మరూఫ్(కెప్టెన్), ముబీనా అలీ(వికెట్ కీపర్), ఆనమ్ అమిన్, ఐమన్ అన్వర్, డయానా బేగ్, నిదా దర్, గుల్ ఫిరోజా(వికెట్ కీపర్), తుబా హసన్, కైనట్ ఇంతియాజ్, సాదియా ఇక్బాల్, ఈరమ్ జావేద్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా దాయాది జట్టుపై వరుసగా 11వ సారి గెలుపొంది సత్తా చాటింది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
India Vs England 5th Test Day 4: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రీషెడ్యూల్డ్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన భారత అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర రీతిలో వారిని దూషించారు. ఈ మేరకు ఓ ట్విటర్ యూజర్ సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇంగ్లండ్ అభిమానులు తమను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపించారు. ఈ విషయం గురించి అక్కడున్న వాళ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమతో పాటు అక్కడున్న మహిళలు, చిన్నారుల భద్రత కూడా ప్రమాదంలో పడిందని, సిబ్బందిలో ఒక్కరు కూడా తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆరోపించారు. నాగరిక సమాజంలో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలిని ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ‘‘టెస్టు మ్యాచ్ సందర్భంగా కొంతమంది జాతి వివక్ష ప్రదర్శిస్తూ అసభ్య పదజాలం వాడినట్లు మా దృష్టికి వచ్చింది. ఇందుకు మేము చింతిస్తున్నాం. ఎడ్జ్‌బాస్టన్ అధికారులతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం. క్రికెట్లో జాతి వివక్షకు తావు లేదు’’ అని ట్వీట్ చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Dutee Chand: మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన భారత మహిళా అథ్లెట్ Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricket pic.twitter.com/GJPFqbjIbz — Lacabamayang!!!!!!! (@AnilSehmi) July 4, 2022 We are very concerned to hear reports of racist abuse at today's Test match. We are in contact with colleagues at Edgbaston who will investigate. There is no place for racism in cricket — England and Wales Cricket Board (@ECB_cricket) July 4, 2022 -
Eng Vs Nz: ప్రయోగాత్మకంగా 18 వేల మందితో...
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో కరోనా తగ్గుముఖం పట్టడంతో వివిధ బహిరంగ కార్యక్రమాల్లో నెమ్మదిగా సాధారణ స్థితి చోటు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే అవకాశం ఉన్న చోట ఎలాంటి కరోనా ఆంక్షలు పెట్టకుండా ఎక్కువ మందిని అనుమతిస్తే ఎలా ఉంటుంది? అసలు కరోనా తీవ్రత ఏమిటో, తాజా స్థితి ఏమిటో తెలిసిపోతుంది కదా! బ్రిటన్ ప్రభుత్వం ఇదే ఆలోచనతో కొన్ని పైలట్ కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జూన్ 10 నుంచి జరిగే రెండో టెస్టులో స్టేడియం సామర్థ్యం లో 70 శాతాన్ని అనుమతించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగే ఈ టెస్టుకు ప్రతీరోజు కనీసం 18 వేల మంది వరకు హాజరు కావచ్చు. మ్యాచ్‌కు వచ్చే వారంతా 16 ఏళ్లకంటే ఎక్కువ వారై ఉండి, కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటే చాలు. మ్యాచ్ జరిగే సమయంలో మాస్క్‌లు వేసుకోవడం మినహా మరే ఇతర ఆంక్షలు ఉండవు. 2020 సీజన్ మొత్తం ప్రేక్షకులు లేకుండానే ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్లకు కూడా ఇది కొత్త ఉత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడంతో లార్డ్స్‌లో జరిగే తొలి టెస్టులో మాత్రం ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 25 శాతం మందినే అనుమతిస్తారు. గత కొద్ది రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఎఫ్ఏ కప్ ఫైనల్ (20 వేలు), స్నూకర్ ఫైనల్ (ఇండోర్‌లో వేయి మంది), కొన్ని మ్యూజిక్ కన్సర్ట్లు కలిపి మొత్తం 58 వేల మంది వరకు అనుమతించగా... చివరకు 15 మంది మాత్రమే ఇందులో కోవిడ్–19 పాజిటివ్‌గా తేలారు. -
కరోనా టెస్టింగ్ సెంటర్‌గా క్రికెట్ స్టేడియం..!
బర్మింగ్హమ్: కరోనా వైరస్ నియంత్రణకు ఏమి చేయాలో తెలియక ప్రపంచ మొత్తం అల్లాడుతోంది. దీన్ని ఎలా నియంత్రించాలో తెలియక వరల్డ్ అంతా లాక్డౌన్లోకి వెళ్లిపోతే, కరోనా వైరస్ మాత్రం ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టిన దాఖలు కనబడుటం లేదు. ఈ వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీల కోసం పలు దేశాలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేయగా, ప్రస్తుత పరిస్థితిల్లో కరోనా బాధితులు గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో టెస్టుల కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కరోనా బాధితులకు కేవలం ఆస్పత్రిల్లోనే చికిత్స చేయడం సాధ్య పడదు కాబట్టి, రైళ్లు, స్పోర్ట్స్ అకాడమీలు ఇలా ప్రతీ దాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఇంగ్లండ్‌లో ఏకంగా ఒక క్రికెట్ స్టేడియాన్నే సిద్ధం చేశారు. ప్రముఖ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియాన్నికోవిడ్-19 టెస్టింగ్ సెంటర్‌గా మార్చే యోచనలో ఉన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసుల్లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ స్టేడియాన్ని కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్‌గా మార్చడానికి కసరత్తులు పూర్తి చేసినట్లు వార్విక్షైర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీల్ స్నో బాల్ తెలిపారు. ‘ మా దేశంలో క్రికెట్ సంబంధిత కార్యక్రమాలు, సమావేశాలు, ఈవెంట్స్, వ్యాపార కార్యకలాపాలు అన్నీ కూడా మే 29వరకూ బంద్ చేశాం. ఈ క్లిష్ట సమయంలో మా సిబ్బంది అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండటంపైనే దృష్టి సారించింది. దీనికి మా మాజీ ఆటగాళ్ల సాయం కూడా తీసుకుంటున్నాం. ఎడ్జ్‌బాస్టన్‌ను కరోనా వైరస్ సెంటర్‌గా మార్చడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందుకు అనుమతి లభించిన వెంటనే ఇక్కడ కరోనా టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది’ అని నీల్ స్నో బాల్ తెలిపారు. ఇక్కడ చదవండి: యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్ అత్యధిక ధర ఆటగాడి ఎదురుచూపులు..! -
బ్రిటన్ పార్లమెంట్‌కు తొలిసారిగా సిక్కు మహిళ ఎన్నిక
లండన్: బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ చరిత్రాత్మక విజయం సాధించి, పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి పోటీ చేసి 24,124 ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి కరోలిన్ స్క్వైర్‌పై గ్రిల్ 6,917 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎడ్జ్‌బాస్టన్‌కు ఎంపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అదే పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్మన్జీత్ సింగ్ దేశి కూడా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిపై 16,998 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. స్లోగ్ సీటు నుంచి తన్మన్జీత్ పోటీ చేసి 34,170 ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కులకు అవకాశం ఇచ్చినందుకు లేబర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మరో సిక్కు అభ్యర్థి కుల్దీప్ సహోతా ప్రత్యర్థి చేతిలో 720 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రిటన్ పార్లమెంట్‌కు ఇద్దరు సిక్కు అభ్యర్థులు గెలుపొందడం ఇదే తొలిసారి. -
బ్రిటన్‌లో 'తొలి గులాబి' మ్యాచ్
లండన్: క్రికెట్ పుట్టినిళ్లుగా పేరున్న బ్రిటన్ తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌కు వేధికను ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఎడ్గ్బాస్టన్లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్‌తో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మొట్టమొదటి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గత ఏడాది జరిగింది. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన టెస్ట్‌గా ఆ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను తొలిసారి వాడారు. కాగా, వచ్చే వారంలో పాకిస్తాన్, వెస్టిండిస్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడునుంది. దీంతో డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చిన దేశాల్లో మూడో స్థానంలో బ్రిటన్ నిలువనుంది. పగలు పని చేసేవారు కూడా టెస్ట్ మ్యాచ్‌లను వీక్షిండానికి ప్రోత్సాహం కల్పించడమే తమ లక్ష్యం అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది ఆగష్టు17-22 మధ్య జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో వెస్టిండిస్‌తో తలపడనుంది. -
ఇంగ్లండ్ ఆటతీరుపై ఇయాన్ బోథమ్ ఆగ్రహం!
లండన్: ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరు ఓ జోక్ తలపించిందని ఆదేశ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన తీరు ఆగ్రహం తెప్పించిందని ఆయన అన్నారు. ప్రపంచ కప్ కు ఆరునెలల ముందు ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉందని బోథమ్ మండిపడ్డారు. ఇలా దారుణమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ కు బదులు 'ఎగ్ కప్' గెలుచుకుంటే అదృష్టమే అని వ్యాఖ్యలు చేశారు. పరాజయాల నుంచి ఇంగ్లాండ్ గుణపాఠం నేర్చుకోవడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసిన తప్పులే మళ్లీ.. మళ్లీ చేస్తుండటం తనను నిరాశకు గురిచేస్తోందని బోథమ్ అన్నారు.