
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ అండ్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్ .. కెప్టెన్‌గా మాత్రం జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా శ్రీలంకతో టెస్టులకు ముందు రోహిత్ శర్మను పూర్తి స్ధాయి భారత టెస్ట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.
"రోహిత్ ఇప్పటికే భారత పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తోన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పట్ల జట్టులో చాలా మంది ఆటగాళ్లు సంతృప్తిగా ఉన్నారు. అతడు ఆటగాళ్లకు చాలా స్వేఛ్చను ఇస్తాడు. అతడు తన వ్యుహాలతో ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు, బౌలింగ్‌లో మార్పులు అద్భుతంగా చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో విహారి అద్భుతంగా ఆడాడు.
ఇక శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించి రోహిత్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. అతడు తన నిర్ణయంతో మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించాడు. అదే విధంగా రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా ఆడాడు. చాలా సార్లు తన బ్యాటింగ్‌తోను భారత జట్టును గెలిపించాడు. బీసీసీఊ కాంట్రాక్టులో జడేజా A+ కేటగిరీ ఆర్హుడు" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా!
Comments
Please login to add a commentAdd a comment