స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. లక్నో వేదికగా ఫిబ్రవరి 24న భారత్- శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే గాయం కారణంగా టీమిండియా రెగ్యూలర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్‌కు ఓపెనింగ్ జోడిగా ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే కిషన్ ఈ సిరీస్‌లో తన స్ధాయికు తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్‌లు ఆడిన కిషన్ కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌లో రోహిత్‌కు జోడిగా రుత్‌రాజ్ గైక్వాడ్‌ను పంపాలని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా విండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఓపెనర్‌గా వచ్చిన గైక్వాడ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు."శ్రీలంకతో సిరీస్‌లో రోహిత్ శర్మ, రుజరాజ్ గైక్వాడ్‌లు భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలి. ఎందుకంటే వెస్టిండీస్ జరిగిన సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చారు. అయితే ఈ సిరీస్‌లో కిషన్ అంతగా రాణించలేదు. కాబట్టి గైక్వాడ్‌కు కనీసం రెండు మ్యాచ్‌లోనైనా ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి" అని జాఫర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment