
రిషభ్ పంత్, రోహిత్ శర్మ(PC: BCCI)
Rohit Sharma: రోహిత్ అంటే హిట్టూ.. ఓడేదేలే సాలా.. దటీజ్ మై కెప్టెన్!
Ind Vs Sl 2nd Test: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వరుస విజయాలు సాధిస్తున్నాడు. అతడి సారథ్యంలో టీమిండియా క్లీన్‌స్వీప్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే జట్టు పరంగా భారత్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో పలు రికార్డులు నమోదయ్యాయి. శ్రీలంకతో టెస్టు సిరీస్ వైట్‌వాష్ తర్వాత... పూర్తిస్థాయి కెప్టెన్‌గా అరంగేట్ర సిరీస్‌లలో (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన మొట్టమొదటి సారథిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
ఇక స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా భారత జట్టు చరిత్రకెక్కింది. ఈ క్రమంలో రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా మీమ్‌లు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. శ్రీలంకతో రెండో టెస్టులో విజయంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. మరో వైట్‌వాష్ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి అదిరిపోయే మీమ్ పంచుకున్నారు.
పుష్ప మేనియాను గుర్తు చేస్తూ.. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మాస్‌లుక్‌ను షేర్ చేసిన వసీం జాఫర్.. ‘‘పూర్తిస్థాయి కెప్టెన్ అయిన నాటి నుంచి.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ 3-0, వెస్టిండీస్ వన్డే సిరీస్ 3-0, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ 3-0, శ్రీలంకతో టీ20 సిరీస్ 3-0, శ్రీలంకతో టెస్టు సిరీస్ 2-0.. నేను ఓడేదేలే సాలా’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మీమ్ చూసి రోహిత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పుష్ప అంటే ఫైరూ.. రోహిత్ అంటే హిట్టూ ఓడేదేలే సాలా... దటీజ్ మై కెప్టెన్ నిజం చెప్పారు మీరు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ
CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W
— BCCI (@BCCI) March 14, 2022
Since @ImRo45 became full time Captain:
3-0 vs NZ (T20I)
3-0 vs WI (ODI)
3-0 vs WI (T20I)
3-0 vs SL (T20I)
2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M
— Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022