గయానా వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో అమీతుమీ తెల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న విండీస్ మాత్రం.. అదే జోరును కనబరిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20కు ఇషాన్ కిషన్ స్ధానంలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని జాఫర్ సూచించాడు.
కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన కిషన్.. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో మాత్రం నిరాశపరిచాడు. అయితే ఈ సిరీస్ మాత్రమే కాకుండా టీ20ల్లో అంత మంచి రికార్డు కిషన్‌కు లేదు. ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన కిషన్.. 25 కంటే తక్కువ సగటుతో 659 పరుగులు చేశాడు.
"విండీస్‌తో రెండో టీ20లో యశస్వి జైస్వాల్‌ని చూడాలనుకుంటున్నాను. అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగాలి. ఇషాన్ కిషన్ స్ధానంలో జైశ్వాల్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కిషన్ టీ20ల్లో పేలవ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో అతడు 40 పరుగులు కూడా చేయలేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది.
కాబట్టి అతడిని పక్కన పెడితే మంచింది. అయితే అతడు వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ టీ20 అనేది భిన్నమైన ఫార్మాట్. అతడు ఐపీఎల్‌లో కూడా అంతగా రాణించలేకపోయాడు. జైశ్వాల్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్‌లో దుమ్మురేపాడు. అందుకే అతడు కచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి" అని జాఫర్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: #Alex Steele: 83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment