వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు వరుస విజయాలతో ఊపుందుకున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫోరిడా వేదికగా శనివారం జరిగిన నాలుగో టీ20లో విండీస్‌ను భారత్ చిత్తు చేయడంతో సిరీస్ 2-2 సమమైంది. ఈ క్రమంలో ఇదే వేదికలో ఆదివారం జరగనున్న సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో భారత్-విండీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు కరేబియన్లు ఈ మ్యాచ్‌లో గెలిచి కనీసం టీ20 సిరీస్‌నైనా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది.
చాహల్‌పై వేటు..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అదే విధంగా ఫ్లోరిడా పిచ్ పేసర్లకు కాస్త అనుకూస్తుంది కాబట్టి ఉమ్రాన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు విండీస్ కూడా ఒకే ఒక మార్పుతో ఆడనున్నట్లు సమాచారం. నాలుగో టీ20లో విఫలమైన ఓడియన్ స్మిత్ స్ధానంలో అల్జారీ జోసఫ్‌ను తిరిగి తీసుకురావాలని విండీస్ జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
వెస్టిండీస్ జట్టు (అంచనా): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, రావ్‌మెన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమేరియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్
భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
చదవండి: ఇదే నేను ఆశించా.. చాలా సంతోషంగా ఉంది! వారిద్దరూ అద్భుతం: హార్దిక్
Comments
Please login to add a commentAdd a comment