Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకి భారత్ తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగతున్నాయి. డిసెంబరు 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇక బ్యాక్సింగ్‌డే టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను శుభారంభం చేయాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సవాల్‌గా మారింది. మిడిలార్డర్‌లో రెండు స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి రేసులో ఉన్నారు.
కాగా ప్రస్తుతం అజింక్య రహానె టెస్టుల్లో ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి విదేశాల్లో ఉన్న రికార్డుల దృష్ట్యా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు ఆరంగ్రేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్‌కు మిడిలార్డర్‌లో చోటు దక్కచ్చు. ఇక మరోసారి హనుమ విహారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తుది జట్టులో ఎవరకి చోటుదక్కుతుందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో క్రికెట్ నిపుణలు, మాజీలు దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను అంచనా వేస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా చేరాడు. తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను జాఫర్ ఎంచుకున్నాడు.
ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక ఫామ్‌లో లేకపోయిన ఛెతేశ్వర్ పుజారాకు తన జట్టులో మూడో స్ధానంలో చోటు కల్పించాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ కోహ్లికు చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో అతడు అజింక్యా రహానె వైపే మెగ్గుచూపాడు. ఆరో స్ధానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. ఇక జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు ఇచ్చాడు. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంచుకున్నాడు. ఇక బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్‌కు వసీం చోటు ఇచ్చాడు. కాగా జాఫర్ ప్రకటించిన జట్టులో హనుమ విహారి చోటు దక్కలేదు.
వసీం జాఫర్ ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్..
Comments
Please login to add a commentAdd a comment