Wasim Jaffer On Tilak Varma’s batting performance on T20I debut: ‘‘అద్భుతంగా ఆడాడు. అతడి ఆటకు వంక పెట్టే అవకాశమే లేకుండా చేశాడు. ఏదో క్లబ్ గేమ్‌లోనో.. రాష్ట్రస్థాయి జట్టుకో ఆడుతున్నట్లు ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనివ్వలేదు. తనదైన శైలిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
తొలి మ్యాచ్‌లోనే ఇలా బెరుకు లేకుండా ఆడటం చూస్తుంటే మానసికంగా అతడు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో అర్థమవుతోంది. ఈ పిచ్‌పై మిగతా వాళ్లంతా విఫలమైన వేళ అతడు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆడాడు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించాడు. ఇంకాసేపు తిలక్ క్రీజులో ఉంటే భారత జట్టు తేలికగా మ్యాచ్ గెలిచేదని అభిప్రాయపడ్డాడు.
మరో హైదరాబాదీ ఆగమనం
ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో టీమిండియా వెస్టిండీస్‌తో తొలి టీ20లో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా.. హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
విండీస్ విధించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక ‘స్టార్లు’ విఫలమైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి 3 బంతుల్లోనే రెండు సిక్సర్లతో అలరించాడు. జట్టులో అనుభవమున్న సీనియర్ ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అద్భుతమైన షాట్లు
ఈ నేపథ్యంలో.. వసీం జాఫర్ మాట్లాడుతూ.. తిలక్ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఒకవేళ ఈ యువ బ్యాటర్ 50- 60 పరుగులు చేసి టీమిండియా గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తిలక్ అరంగేట్ర మ్యాచ్‌లో ఈ మేరకు రాణించడం జట్టుకు శుభసూచకమని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని వసీం జాఫర్ పేర్కొన్నాడు.
ఓటమిపాలై..
కాగా రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక విండీస్‌తో తొలి టీ20లో ఓపెనర్లు ఇషాన్ కిషన్(6), శుబ్‌మన్ గిల్(3) సహా.. నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్య(21), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(19), సంజూ శాంసన్(12) చేతులెత్తేయడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆతిథ్య కరేబియన్ జట్టు 4 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్‌కు కూడా..!
Takes a blinder.
— FanCode (@FanCode) August 3, 2023
Hits back to back sixes to kick off his innings.
A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSR
Comments
Please login to add a commentAdd a comment