Tilak Varma Surpasses Gambhir, Equals Suryakumar To Set New T20I Records - Sakshi
Sakshi News home page

Tilak Varma: గంభీర్‌ రికార్డు బద్దలు కొట్టిన తిలక్‌ వర్మ.. అరుదైన ఘనత! హర్దిక్‌ వల్ల..

Published Wed, Aug 9 2023 10:22 AM | Last Updated on Wed, Aug 9 2023 10:51 AM

Tilak Varma Storms Past Gambhir Equals Suryakumar New T20I Heights Records - Sakshi

West Indies vs India, 3rd T20I: టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ వెస్టిండీస్‌తో మూడో టీ20లోనూ అదరగొట్టాడు. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌ చేసిన ఈ లెఫ్టాండర్‌ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెరీర్‌లో రెండో అర్ధ శతకం నమోదు చేసే అవకాశం తృటిలో చేజారినా.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి తనదైన ముద్ర వేయగలిగాడు.

గంభీర్‌ రికార్డు బద్దలు
అంతేకాదు.. తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ హైదరాబాదీ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున తొలి మూడు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ను అధిగమించి.. నంబర్‌ 1 టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

సూర్య సంచలనం.. తొలి గెలుపు
ఈ జాబితాలో 172 పరుగులతో దీపక్‌ హుడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా వెస్టిండీస్‌తో తొలి రెండు టీ20లలో ఓటమిపాలైన హార్దిక్‌ పాండ్యా సేన.. మూడో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్‌ సంచలన ఇన్నింగ్స్‌(44 బంతుల్లో 83 పరుగులు)కు తోడు తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా(20- నాటౌట్‌) రాణించడంతో ఈ సిరీస్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.

పాపం ఒక్క పరుగుకే
గయానాలో విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి.. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌ పూర్తిగా విఫలమయ్యాడు.

విండీస్‌పై సెంచరీతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. టీ20 ఫార్మాట్‌ను మాత్రం ఒక్క పరుగుతో ఆరంభించాడు. కాగా హార్దిక్‌ సిక్సర్‌తో జట్టును విజయ లాంఛనం పూర్తిచేయగా.. మరో ఎండ్‌లో ఉన్న తిలక్‌ 49 పరుగుల వద్దే నిలిచిపోయాడు.

అంతర్జాతీయ టీ20లలో తొలి మూడు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు వీరే..
1. దీపక్‌ హుడా- 172 పరుగులు (21,47, 104)
2. సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ- 139 పరుగులు
2. గౌతం గంభీర్‌- 109 పరుగులు(0, 51, 58)

మరో రికార్డు కూడా.. నంబర్‌ 1తో కలిసి
వెస్టిండీస్‌తో ఆడిన మూడు టీ20 మ్యాచ్‌లలో హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ చేసిన పరుగులు వరుసగా 39, 51, 49. మొత్తంగా 139 పరుగులు సాధించిన ఈ యువ ఆటగాడు.. తొలి మూడు ఇన్నింగ్స్‌లో 30కి పైగా పరుగులు చేసి.. సూర్యకుమార్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

చదవండి:  మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది?
చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement