ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది.
ఈ పర్యటనలో భారత జట్టు నుంచి కొంత మంది కొత్తముఖాలను చూసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు. విండీస్ పర్యటనలో ఫియర్‌లెస్ క్రికెట్ ఆడే యువకులకు జట్టులో చోటివ్వాలని జాఫర్ అభిప్రాయపడడ్డాడు.
"టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలి. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్‌లో మరింత దూకుడుగా ఆడాలి. ధైర్యంగా ఆడే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనం విజయాలు సాధిస్తాం. అదే విధంగా టీ20 క్రికెట్ జట్టులో యశస్వి జైస్వాల్ వంటి విధ్వంసకర ఆటగాడికి కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి.
భారత్‌కు రింకూ సింగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం జట్టులో లేడు కాబట్టి అతడి స్ధానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలి. అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు. నా వరకు అయితే విండీస్‌తో వన్డే సిరీస్‌కు సంజు శాంసన్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: అహ్మదాబాద్‌లో ఆడటానికి ఎందుకంత భయం.. దెయ్యం ఏమైనా ఉందా: పీసీబీపై అఫ్రిది ఫైర్
Comments
Please login to add a commentAdd a comment