Netizens Shower Praise on Shubman Gill Innings - Sakshi
Sakshi News home page

IND vs WI: ఐపీఎల్‌లోనే ఆడుతాడు.. పనికిరాడన్నారు!నోళ్లు మూయించాడుగా! బాస్‌ ఈజ్‌ బ్యాక్‌

Published Sun, Aug 13 2023 9:29 AM | Last Updated on Sun, Aug 13 2023 10:46 AM

Netizens Shower Praise on Shubman Gill innings - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఎట్టకేలకు తన పవర్‌  ఎంటొ చూపించాడు. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో గిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 179 పరుగుల లక్ష్య ఛేదనలో మరోఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు.

జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. గిల్‌తో పాటు జైశ్వాల్‌(84) కూడా అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. జైశ్వాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
కాగా ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో గిల్‌ తీవ్రనిరాశపరిచాడు. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు పాలైయ్యాడు. "ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతాడని, అహ్మదాబాద్‌ పిచ్‌ను తాయారు చేయండి అంటూ" నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు.

అయితే అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. గిల్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఎక్కడైనా బౌలర్లకు చుక్కలే అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక భారత్‌ విండీస్‌ మధ్య సిరీస్‌ డిసైడర్‌ ఇదే వేదికలో ఆదివారం జరగనుంది. 
చదవండిఇదే నేను ఆశించా.. చాలా సంతోషంగా ఉంది! వారిద్దరూ అద్భుతం: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement