ICC Mens T20 World Cup 2022: ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు.. మరోవైపు వర్షం కారణంగా డేంజర్ జోన్‌లో పడుతున్న జట్లు.. సూపర్-12లో ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు వాన వల్ల రద్దు కాగా.. వరణుడు ఎవరిని కరుణిస్తాడో.. ఎవరిని ముంచుతాడో తెలియని సందిగ్ద పరిస్థితి.. వెరసి టీ20 వరల్డ్‌కప్-2022 ఆసక్తికరంగా సాగుతోంది.
ఇదిలా ఉంటే వ్యక్తిగత ప్రదర్శనతో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్.. బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్‌లో కోహ్లి, పాండ్యా చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు.
ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి- సూర్య జోడీ.. సరేసరి. ఈ బ్యాటర్లు ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగగా.. పేసర్లు భువనేశ్వర్ కుమార్- అర్ష్‌దీప్ రాణించారు. ముఖ్యంగా భువీ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్ పరుగులు సమర్పించుకున్నప్పటికీ 2 వికెట్లు తీయగలిగాడు.
వాళ్లిద్దరే!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వరల్డ్‌కప్-2022 టోర్నీలో టాప్ రన్ స్కోరర్, అత్యధిక వికెట్లు తీసే ఆటగాళ్లను అంచనా వేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వసీం జాఫర్‌ను ఓ నెటిజన్ ఈ విషయం గురించి అడుగగా.. ‘‘విరాట్ కోహ్లి, అర్ష్‌దీప్ సింగ్’’ అంటూ వీళ్లిద్దరికీ దిష్టి తగలకూడదన్నట్లుగా ఓ ఎమోజీని జత చేశాడు.
కాగా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కోహ్లి 144 పరుగులు(82 నాటౌట్, 62 నాటౌట్) చేశాడు. ఇక అర్ష్‌దీప్ పాక్‌తో మ్యాచ్‌లో మూడు, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.
చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి?
Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment