సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు... మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా ప్రొటిస్‌ను స్వదేశంలో ఓడించడం వీలుపడలేదు... ఒక్కటంటే ఒక్కటి .. ఈ ఒక్కటి గెలిస్తే చాలు ప్రపంచాన్నే గెలిచినట్లు అవుతుందనే కల కలగానే మిగిలిపోయింది. మూడో టెస్టు మ్యాచ్‌లో ఓటమితో కోహ్లి సేనకు చేదు అనుభవమే మిగిలింది. ముఖ్యంగా మనకు ప్రధాన బలంగా భావించే బ్యాటింగ్‌లో వైఫల్యం అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.
దీంతో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది! అవకాశం దొరికితే చాలు... భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కడం అతడికి అలవాటే కదా! ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌లో ఓటమిపాలు కావడంతో మరోసారి టీజ్ చేశాడు మైకేల్ వాన్. అతడికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ను ఉద్దేశించి తనదైన వ్యంగ్య రీతిలో ట్వీటాడు.
‘‘శుభ సాయంత్రం వసీం జాఫర్!! నువ్వు బాగానే ఉన్నావా’’ అంటూ టీజ్ చేశాడు. మరి... వసీం జాఫర్ ఊరుకుంటాడా.. ఎప్పటిలాగే మాంచిగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చిపడేశాడు. ‘‘అంతా బాగానే ఉంది మైకేల్... మర్చిపోకు... మేము మీకంటే ఇంకా 2-1 తేడాతో ముందే ఉన్నాము’’ అంటూ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. కాగా గతేడాది సెప్టెంబరులో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్ రెండింట నెగ్గి 2-1 తేడాతో ముందంజలో ఉంది. భారత శిబిరంలో కరోనా కలకలం కారణంగా ఆఖరి టెస్టు రద్దుకాగా... ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు ఇరు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.
చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం..!
The #Proteas bowling attack producing when it matters most💚 🇿🇦
— Cricket South Africa (@OfficialCSA) January 14, 2022
Day three highlights: https://t.co/SSbyoUVZSF#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/xEA1xSuuHj
Haha all good Michael, don't forget we are still leading you 2-1 😆 https://t.co/vjPxot43mF
— Wasim Jaffer (@WasimJaffer14) January 14, 2022
Comments
Please login to add a commentAdd a comment