బంగ్లాదేశ్‌తో అఖరి హోరాహోరీగా జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లా బ్యాటర్ నూరల్ హసన్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వివాదాస్పద ఘటనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు.
జాఫర్ క్రిక్ ట్రాకర్‌తో మాట్లడూతూ.. "ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన పనిని అంపైర్‌లు గుర్తించపోయినప్పటికీ.. గ్రౌండ్‌లో చాలా కెమెరాలు ఉన్నాయి. కానీ ఫీల్డ్‌లో ఏ ఆటగాడైనా అలా మొదటి సారి చేస్తే.. అంపైర్‌లు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తారు. రెండో సారి అదే తప్పు పునారావృతం అయితే అప్పుడు అంపైర్లు పెనాల్టీ విధిస్తారు.
బహుశా భారత కెప్టెన్, కోహ్లికి కూడా అంపైర్లు ఈ మ్యాచ్‌లో వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చు. అదే విధంగా కోహ్లి చేసిన యాక్షన్ వాళ్ల బ్యాటర్లకు కూడా ఇటువంటి ఇబ్బంది కలగలేదు. అందుకే బంగ్లా బ్యాటర్లు కూడా ఎటువంటి అప్పీలు చేయలేదు. ఈ విషయంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు." అనిఅతడు పేర్కొన్నాడు.
చదవండి: Kohli Fake Fielding: డిస్టర్బ్ అయినట్లు కనిపించలేదు.. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఇవ్వలేదు
Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment