T20 World Cup 2021: Wasim Jaffer Reaction To Pakistan Tweets On India Out From World Cup - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: టీమిండియా నిష్క్రమణపై పాక్‌ క్రికెట్‌ వ్యంగ్యాస్త్రాలు.. కౌంటరిచ్చిన వసీం జాఫర్

Published Mon, Nov 8 2021 6:27 PM | Last Updated on Tue, Nov 9 2021 10:26 AM

T20 World Cup 2021: Wasim Jaffer Gives Savage Reply To Cricket Pakistan Tweet - Sakshi

Wasim Jaffer Gives Savage Reply To Cricket Pakistan Tweet: టీ20 ప్రపంచకప్-2021 బరి నుంచి టీమిండియా నిష్క్రమించడంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ట్విటర్‌ వేదికగా భారత అభిమానులను కించపరుస్తూ.. వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. భారత అభిమానుల్లారా.. ఎలా ఫీలవుతున్నారు అంటూ ప్రశ్నించింది. ఈ ట్వీట్‌కు చిర్రెత్తుకుపోయిన భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన స్టైల్‌లో కౌంటరిచ్చాడు. 12-1 మధ్య లంచ్ బాగా చేసాను.. ఇంకా ఫుల్‌గా ఉంది అంటూ సెటైర్‌ వేసాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌పై టీమిండియా ఆధిపత్యాన్ని(12-1) సూచిస్తూ.. జాఫర్‌ కౌంటర్‌ అటాక్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే, అప్గానిస్థాన్‌.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూడడంతో టీమిండియా సెమీస్‌ ఆశలు ఆవిరై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా ఐసీసీ ఈవెంట్‌లో నాకౌట్‌ దశకు చేరకపోవడం ఇదే తొలిసారి. సెమీస్‌ ఆశలు ఆవిరైన నేపథ్యంలో ఇవాళ(నవంబర్‌ 8) జరగనున్న నామమాత్రపు పోరులో టీమిండియా.. పసికూన నమీబియాతో తలపడనుంది. టీ20 సారథిగా విరాట్‌ కోహ్లికి ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఈ పోరుకు ప్రాధాన్యత సంతరించుకుంది. కోహ్లి సహా రవిశాస్త్రి నేతృత్వంలోని శిక్షణా బృందానికి సైతం ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో భారత డ్రెసింగ్‌ రూమ్‌లో తీవ్ర భావోద్వేగం నెలకొంది.
చదవండి: అక్తర్‌ కొంప ముంచిన హర్భజన్‌.. దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పీటీవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement