ముంబై: ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను పురస్కరించుకొని శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం మ్యాచ్‌కు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. దీంతోపాటు 95 పేజీల బుక్‌ను రూపొందించి సమగ్రంగా వివరించడమే గాక ఆటకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను అందులో జత చేసి విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన ఆ బుక్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు.
ట్రోల్స్ చేయడంలో ఎప్పుడు ముందుండే జాఫర్ ఈసారి రవిచంద్రన్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ ఒక మీమ్ తయారు చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో సంజయ్ దత్ క్లాస్‌రూంలో తనకు పాఠాలు అర్థం కాకపోవడంతో తన పక్కనే కూర్చున్న మరో స్టూడెంట్‌కు.. వాళ్లు చెప్పే పాఠాలు బాగా విను.. రూంకు వచ్చి నాకు అర్థమయ్యేలా చెప్పు అంటూ డైలాగ్ చెప్తాడు. దాన్ని పేరడిగా తీసుకున్న జాఫర్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రూపొందించిన బుక్‌పై కామెంట్ చేశాడు.
''ఒక్క ముక్క అర్థం కాలేదు.. టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్ అందరికంటే జీనియస్.. మంచి మేథమెటిషీయన్‌గా పేరున్న అశ్విన్ స్టాట్స్ , రూల్స్ గురించి బాగా వివరిస్తాడు. అందుకే అతన్ని అడుగుతా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీంతో పాటు ఒక నెటిజన్ సబ్‌టైటిల్స్ ప్లీజ్ అంటూ వినూత్న రీతిలో ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అశ్విన్.. ''అరె బాయ్.. ముందు బుక్‌ను బాగా చదువు.. మేం కూడా అందులో ఏముందో తెలుసుకోవాలి'' అంటూ లాఫింగ్ ఎమోజీతో కామెంట్ చేశాడు.
ఇక జూన్ 18 నుంచి 22వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కివీస్ ఇప్పటికే ఇంగ్లండ్‌లో తమ ప్రాక్టీస్‌ను ఆరంభించగా.. టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ ఉంచాలనే ప్రతిపాదను తొలుత ఐసీసీ పరిశీలించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఐదు రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే ఆరో రోజు కూడా టెస్టు ఆడించాలనేది ఒక ఆలోచనగా పెట్టుకుంది. తాజాగా దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో ఆరో రోజు మ్యాచ్ డ్రా అయినా.. లేదా టై అయినా ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.
చదవండి: WTC Final: సంయుక్త విజేతలకే ఐసీసీ మొగ్గు!
Comments
Please login to add a commentAdd a comment