నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు తమ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ నడ్డి విరిచారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లతో చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి మొత్తంగా 15 వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్లధ్య రెండోటెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది.
ఇక టీమిండియా విజయం అనంతరం ఆసీస్ ఆటతీరును విమర్శిస్తూ.. అశ్విన్‌ను మెచ్చుకుంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్నింగ్ పిచ్ అంటూ కేవలం రెండు పదాలతో ట్వీట్ చేశాడు. ఒక వ్యక్తి వచ్చి లావుగా ఉన్న మనిషిని లగేజీ మూవింగ్ కన్వేయర్ బెల్ట్‌పై పడేయడం కనిపిస్తుంది. సదరు వ్యక్తి అందులో నుంచి బయటకు రాలేక సతమతమవుతాడు. టర్న్ అవుతున్న పిచ్‌పై టీమిండియా స్పిన్ దెబ్బకు ఆసీస్ పరిస్థితి కూడా ఇదే.. అని అర్థం వచ్చేలా ట్వీట్ ఉంది. ఐదు వికెట్లు తీసిన అశ్విన్‌కు కంగ్రాట్స్ అంటూ పేర్కొన్నాడు.
ఈ విషయం పక్కనబెడితే. నాగ్‌పూర్ పిచ్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా సహా అక్కడి మీడియా కోడై కూసింది. పిచ్‌ను టీమిండియా స్పిన్నర్లకు అనుకూలంగా మాత్రమే తయారు చేశారంటూ.. డాక్టర్డ్ పిచ్ అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అయితే మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించారో.. ఆసీస్ డెబ్యూ బౌలర్ టాడ్ మర్ఫీ కూడా అంతే చూపించాడు. అశ్విన్, జడేజాలు చెరో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగితే.. మర్ఫీ ఏడు వికెట్లతో అదరగొట్టాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలమన్న మాట నిజమే కావొచ్చు కానీ ఓపికగా బ్యాటింగ్ చేస్తే పరుగులు వస్తాయని భారత బ్యాటర్లు నిరూపించారు.
In short 😅 Congrats on another fifer @ashwinravi99 👏🏽 #INDvAUS pic.twitter.com/Z6bF5zvDZJ
— Wasim Jaffer (@WasimJaffer14) February 11, 2023
Comments
Please login to add a commentAdd a comment