Wasim Jaffer Picks His India Squad for Asia Cup and T20 World Cup - Sakshi
Sakshi News home page

Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్‌, చహల్‌కు చోటు! బ్యాకప్‌ ప్లేయర్‌గా త్రిపాఠి

Published Fri, May 20 2022 3:52 PM | Last Updated on Fri, May 20 2022 4:51 PM

Wasim Jaffer India Squad For Asia Cup and T20 World Cup 2022 Check - Sakshi

హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌

Asia Cup and T20 World Cup 2022: ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు ఐసీసీ మెగా ఈవెంట్లు వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ రూపంలో క్రికెట్‌ ప్రేమికులకు పెద్ద పండుగే ముందుంది. ఆగష్టు- సెప్టెంబరులో ఆసియా కప్‌, అక్టోబరు- నవంబరులో పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌ నిర్వహించనున్నారు. 

ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌-2022 సీజన్‌లో తిలక్‌ వర్మ, ఉమ్రాన్‌ మాలిక్‌, రాహుల​ త్రిపాఠి తమను తాము నిరూపించుకోవడం సహా హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌కుమార్‌, చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఈ రెండు మెగా టోర్నీలకు తన జట్టును ప్రకటించాడు.


వసీం జాఫర్‌(ఫైల్‌ ఫొటో)

క్రిక్‌ట్రాకర్‌ నాట్‌ జస్ట్‌ క్రికెట్‌ షో వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా తన తుదిజట్టులో యువ ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌-2022లో అదరగొట్టిన దినేశ్‌ కార్తిక్‌కు వసీం చోటునివ్వకపోవడం విశేషం. 

ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌నకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్‌:
వసీం జాఫర్‌ తుది జట్టు:
కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యజువేంద్ర చహల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఇతర సభ్యులు: రుతురాజ్‌ గైక్వాడ్‌, దినేశ్‌ కార్తిక్‌/సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌/కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ/దీపక్‌ చహర్‌.

బ్యాకప్‌ ప్లేయర్లు: పృథ్వీ షా, రాహుల్‌ త్రిపాఠి, టి. నటరాజన్‌.

చదవండి👉🏾RCB Beat GT: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్‌.. ఇక ఢిల్లీ గెలిచిందో అంతే సంగతులు!
చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్‌కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్‌ ఇస్తే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement