T20 World Cup 2021: Semis Current Situation Wasim Jaffer Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: ఇదీ పరిస్థితి.. నువ్వు మరీనూ వసీం భాయ్‌.. చాల్లే!

Published Sat, Nov 6 2021 1:52 PM | Last Updated on Sat, Nov 6 2021 4:39 PM

T20 World Cup 2021: Semis Current Situation Wasim Jaffer Tweet Goes Viral - Sakshi

Semis Current Situation Wasim Jaffer Tweet Goes Viral: టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమకాలీన క్రికెట్‌ సిరీస్‌లు, టోర్నీల సందర్భంగా అతడు చేసే ట్వీట్లు వైరల్‌ అవుతూ ఉంటాయి. టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వసీం జాఫర్‌ అదిరిపోయే మీమ్‌తో సెటైరికల్‌ ట్వీట్‌ చేశాడు.

గ్రూపు-1లో ఆస్ట్రేలియా సెమీస్‌ చేరాలంటే.. ఇంగ్లండ్‌(దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌)విజయంపై.. గ్రూపు-2లో టీమిండియా సెమీస్‌ చేరాలంటే అఫ్గనిస్తాన్‌(న్యూజిలాండ్‌తో మ్యాచ్‌)పై గెలుపుపై ఆధారపడిన సంగతి తెలిసిందే. తాము భారీ తేడాతో విజయం సాధించడం సహా ఇలా ఇతర జట్లు ప్రత్యర్థులపై గెలిస్తేనే టోర్నీలో ముందుకు సాగుతాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని కళ్లకు గట్టేలా.. ఇద్దరు వ్యక్తులు బతికిబట్టకట్టాలంటే.. మరో ఇద్దరిపై ఏవిధంగా ఆధారపడ్డారో తెలియజేసే మీమ్‌ను వసీం జాఫర్‌ షేర్‌ చేశాడు. 

‘‘ప్రస్తుత పరిస్థితి ఇదే! ఇండియా, ఆస్ట్రేలియా.. తాము మాత్రమే గెలవడం కాదు.. అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ కూడా గెలిస్తేనే వారికి మార్గం సుగమం అవుతుంది’’ అని తనదైన శైలిలో ట్వీటాడు. నెటిజన్ల నుంచి ఇందుకు విశేష స్పందన వస్తోంది. అయితే, కొందరు మాత్రం.. ‘‘ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఎంత పెద్ద జట్టుకైనా ఒక్కోసారి ఇలాంటి దుస్థితి తప్పదు. వసీం భాయ్‌.. నువ్వు మరీనూ.. వెటకారం చాల్లే’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: T20 WC: అదొక్కటే దారి.. అలా అయితే భారత్‌ సెమీస్‌ చేరడం ఖాయం.. మరి అఫ్గన్‌ గెలిచినా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement