Shane Warne Choose India and England as Favourites to Win T20 World Cup 2021 - Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ ఆ రెండు జట్లే: షేన్ వార్న్

Published Fri, Oct 22 2021 12:30 PM | Last Updated on Fri, Oct 22 2021 3:42 PM

Shane Warne Choose India and England as favourites to win T20 World Cup 2021 - Sakshi

Shane Warne Choose These 2 as favourites to win T20 World Cup 2021:  టీ20 ప్రపంచకప్‌2021లో భాగంగా సూపర్‌ 12 రౌండ్‌ మ్యాచ్‌లు రేపు(ఆక్టోబర్‌ 23)నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ క్రమంలో ఏ జట్టు టైటిల్‌ను గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు.  తాజాగా ఆసీస్‌ మాజీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ టైటల్‌ గెలుచుకోనే తన పేవరేట్‌ జట్లును అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్‌2021 టైటిల్‌ విజేతగా ఇంగ్లండ్‌, భారత్‌ జట్లు ఫేవరెట్‌గా ఉన్నాయని షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. మరో వైపు  ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను ఏ విధంగానూ తేలికగా తీసుకోవద్దని వార్న్‌ హెచ్చరించాడు. పాకిస్తాన్ , వెస్టిండీస్‌ జట్లు నుంచి  మిగతా జట్లు గట్టి పోటీ ఎదుర్కొంటాయి అతడు తెలిపాడు.

"టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ బరిలో భారత్‌, ఇంగ్లండ్‌ నిలుస్తాయని నేను అనుకుంటున్నాను. న్యూజిలాండ్‌ కూడా ఐసీసీ ఈవెంట్‌లలో  ఆద్బతుంగా ఆడుతుంది. మరో వైపు ఆసీస్ జట్టులో చాలా మంది హిట్టర్లు ఉన్నందున వారిని తక్కువగా అంచనా వేయకూడదని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్‌, భారత్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని షేన్‌ వార్న్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.  

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టీమిండియా మంచి ఊపుమీద ఉంది. కాగా తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌  చేతిలో ఓటమి చెందిన ఇంగ్లండ్‌.. రెండో వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి తిరిగి ట్రాక్‌లో పడింది. అక్టోబర్ 24  కోహ్లి సేన దాయాది దేశం పాకిస్తాన్‌తో  తలపడనుంది.

చదవండి: ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు.. ఆస్ట్రేలియా ఆటగాడు సరికొత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement