తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఇరు జట్లు మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అంచనా వేశాడు.
తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు తను ఎంపిక చేసిన జట్టులో జాఫర్ చోటివ్వలేదు. రాహుల్ స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు, సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరాడు.
ఈ క్రమంలో అతడు ఢిల్లీ టెస్టు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ కూడా దృవీకరించింది. ఇక రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచారు. రాహుల్ 20 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. సూర్య తన అరంగేట్ర టెస్టులో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరిని ఢిల్లీ టెస్టుకు దూరం పెట్టాలని పలువరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ కూడా తన అంచనా వేసిన జట్టులో వీరిద్దరికి చోటివ్వకపోవడం గమానార్హం.
తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
చదవండి: West Indies: వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు..
Comments
Please login to add a commentAdd a comment