
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అదే విధంగా టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టుకు రోహిత్ ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం116 పరుగులు మాత్రమే చేశాడు.
"టీ20 ప్రపంచకప్-2024కు ముందు చాలా మంది భారత సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఖచ్చితంగా ఆడడు. అతడు త్వరలో అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది" అని క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: Pak Vs Eng: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం